News September 22, 2024

ఎస్సీ వర్గీకరణపై సుప్రీంలో రివ్యూ పిటిషన్: మాజీ ఎంపీ

image

AP: ఎస్సీ వర్గీకరణకు వ్యతిరేకంగా దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించిందని మాజీ ఎంపీ హర్షకుమార్ తెలిపారు. రిజర్వేషన్లను తొలగించేందుకు కేంద్ర ప్రభుత్వం కుట్ర పన్నుతోందని ఆయన ఆరోపించారు. ఐకమత్యంగా ఉన్న జాతిని విడదీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. దీనిపై సుప్రీంకోర్టులో పోరాడుతామని చెప్పారు.

Similar News

News February 1, 2026

NRPT: జాతీయ రెజ్లింగ్‌లో సీతామహలక్ష్మికి కాంస్యం

image

న్యూఢిల్లీలో జరిగిన SGFI అండర్-14 జాతీయ రెజ్లింగ్ పోటీల్లో నారాయణపేట జిల్లాకు చెందిన సీతామహలక్ష్మి కాంస్య పతకం సాధించింది. ధన్వాడ కేజీబీవీలో 8వ తరగతి చదువుతున్న ఈమె, పాతతాండ నివాసి. జాతీయ స్థాయిలో రాణించినందుకు డీవైఎస్ఓ వెంకటేశ్, కోచ్ శ్రీనివాస్ నాయక్ ఆమెను అభినందించారు. ఈ విజయం పట్ల జిల్లా క్రీడాకారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

News February 1, 2026

T20 వరల్డ్ కప్‌కు సుందర్ రెడీ.. కెప్టెన్ సూర్య బిగ్ అప్‌డేట్!

image

గాయంతో బాధపడుతున్న వాషింగ్టన్ సుందర్ కోలుకుంటున్నట్లు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ పరోక్షంగా ధ్రువీకరించారు. ఇప్పటికే ఆయన నెట్స్‌లో బ్యాటింగ్, బౌలింగ్ ప్రాక్టీస్ మొదలుపెట్టాడని, ఆరోగ్యంగా కనిపిస్తున్నాడని సూర్య తెలిపారు. సుందర్ ప్రస్తుతం బెంగళూరులోని CoEలో ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్‌లో ఉన్నారు. ఫిబ్రవరి 7న అమెరికాతో జరిగే తొలి మ్యాచ్ నాటికి ఆయన పూర్తి ఫిట్‌నెస్ సాధించే అవకాశం ఉంది.

News February 1, 2026

రాత్రిపూట చికెన్ తింటున్నారా?

image

సండే అంటేనే చాలామంది చికెన్ తిని చిల్ అవుతుంటారు. రాత్రి వేళ తిన్న వెంటనే రెస్ట్ తీసుకోవడం, నిద్ర పోవడం చేస్తుంటారు. అయితే ఈ అలవాటు మంచిది కాదంటున్నారు వైద్యులు. నాన్‌వెజ్ జీర్ణం కావడానికి టైమ్ పడుతుంది కాబట్టి నిద్రకు 3Hrs ముందే భోజనం ముగించాలంటున్నారు. తిన్న వెంటనే పడుకోకుండా నడవాలని, హాట్ వాటర్, పుదీనా టీ తాగాలని సూచిస్తున్నారు. ఇలా చేస్తే అజీర్తి, గుండెలో మంట వంటి సమస్యలు రావని చెబుతున్నారు.