News April 11, 2024
REVIEW: విజయ్ ఆంటోనీ ‘లవ్‌గురు’

పెళ్లి ఇష్టంలేని అమ్మాయిని లవ్ మ్యారేజ్ చేసుకున్న అబ్బాయి పడే ఇబ్బందుల కథే ‘లవ్ గురు’. బిచ్చగాడు, సలీం, సైతాన్ వంటి డిఫరెంట్ మూవీలతో తెలుగు ప్రేక్షకులను అలరించిన విజయ్ ఆంటోనీ తొలిసారి రొమాంటిక్ జానర్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఎప్పటిలాగే విజయ్ తన నటనతో, హీరోయిన్ మృణాళిని అభినయంతో మెప్పించారు. కామెడీ, ఎమోషనల్ సీన్లు ఆకట్టుకుంటాయి. కథలో కొత్తదనం లేకపోవడం, ముందే ఊహించే సీన్లు మైనస్.
రేటింగ్: 2.5/5
Similar News
News December 5, 2025
పాన్ మసాలాలపై సెస్.. బిల్లుకు ఆమోదం

పాన్ మసాలాలపై సెస్ విధించే బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపింది. ‘హెల్త్ సెక్యూరిటీ సే నేషనల్ సెక్యూరిటీ సెస్ బిల్-2025’ ద్వారా వీటి తయారీలో ఉపయోగించే యంత్రాలు, ప్రక్రియలపై సెస్ విధించనున్నారు. వచ్చే ఆదాయాన్ని కన్సాలిడేటెడ్ ఫండ్‌లో(CFI) జమ చేసి జాతీయ భద్రత, ప్రజారోగ్యానికి వినియోగించనున్నారు. ప్రస్తుతానికి పాన్ మసాలాలపైనే సెస్ అని, అవసరమైతే ఇతర ఉత్పత్తులకూ విస్తరిస్తామని ప్రభుత్వం తెలిపింది.
News December 5, 2025
కేటీఆర్‌పై సీఎం రేవంత్ సెటైర్లు

TG: నర్సంపేట సభలో మాజీ మంత్రి KTRపై CM రేవంత్ సెటైర్లు వేశారు. ‘నిన్నమొన్న జూబ్లీహిల్స్‌లో ఒకడు తీట నోరు వేసుకొని తిరిగాడు. ఉపఎన్నిక రెఫరెండం.. రేవంత్ సంగతి తేలుస్తా అన్నాడు. అక్కడ చెత్తంతా రేవంతే వేస్తుండని ప్రచారం చేశాడు. ఇళ్లిళ్లు తిరిగి అందరి కడుపులో తలకాయ పెట్టిండు.. కాళ్లకు దండం పెట్టిండు. వీని తీట అణగాలని ఓటర్లు కాంగ్రెస్‌ను భారీ మెజార్టీతో గెలిపించారు’ అని విమర్శలు గుప్పించారు.
News December 5, 2025
ఇండిగో సంక్షోభం.. కేంద్రం సీరియస్

ఇండిగో విమాన సర్వీసుల అంతరాయాన్ని కేంద్రం తీవ్రంగా పరిగణించింది. ఈ సంక్షోభంపై ఉన్నతస్థాయి దర్యాప్తుకు ఆదేశిస్తున్నట్లు ప్రకటించింది. ఇందుకు కారణమైన వారిని కఠినంగా శిక్షిస్తామని స్పష్టం చేసింది. ప్రయాణికుల సంక్షేమం, భద్రతపై ప్రత్యేక దృష్టి సారించినట్లు పేర్కొంది. మూడు రోజుల్లో సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని వెల్లడించింది. పైలట్ల రోస్టర్ సిస్టమ్‌ను తాత్కాలికంగా నిలిపివేసినట్టు చెప్పింది.


