News June 4, 2024

అమరావతికి పునర్వైభవం?

image

టీడీపీ అధినేత చంద్రబాబు ఏపీ సీఎంగా ప్రమాణం చేయనుండటంతో అమరావతిని రాజధానిగా అభివృద్ధి చేస్తారనే చర్చ మొదలైంది. 2014లో గెలుపొందిన తర్వాత బాబు అమరావతిని రాజధానిగా ప్రకటించి సచివాలయం, హైకోర్టును నిర్మించారు. 2019లో జగన్ అధికారంలోకి వచ్చాక రాజధాని తరలింపును తెరపైకి తెచ్చారు. మళ్లీ CBN అధికారంలోకి రానుండడంతో అమరావతికి పూర్వ వైభవం లభిస్తుందని, రాజధాని పనులు ఊపందుకుంటాయని శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి.

Similar News

News November 30, 2024

టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం

image

పదో తరగతి పరీక్షలపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్నల్ పరీక్షల ఎత్తివేత నిర్ణయాన్ని వాయిదా వేసింది. వచ్చే ఏడాది నుంచి దీన్ని అమలు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ ఏడాది 80శాతం మార్కులతో పరీక్షలు, 20 శాతం ఇంటర్నల్ మార్కులుంటాయని పేర్కొంది. గ్రేడింగ్ విధానంతోనే ఫలితాలు వెల్లడిస్తామని తెలిపింది. కాగా ఈసారి నుంచి ఇంటర్నల్ ఎత్తివేస్తామని ప్రభుత్వం నిన్న <<14735937>>ప్రకటించిన<<>> విషయం తెలిసిందే.

News November 29, 2024

ఆ ప్రచారంలో అల్లు అర్జున్ పాలుపంచుకోవడం సంతోషం: సీఎం రేవంత్

image

డ్రగ్స్ వల్ల జరిగే అనర్థాలపై అవగాహన కల్పించే ప్రకటనలో అల్లు అర్జున్ నటించిన సంగతి తెలిసిందే. దానిపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ‘మన పిల్లల్ని, రాష్ట్రాన్ని డ్రగ్స్ నుంచి రక్షించుకునేందుకు ప్రజల్లో అవగాహనకోసం చేపట్టిన ప్రచారంలో అల్లు అర్జున్‌ని చూడటం సంతోషంగా ఉంది. ఆరోగ్యవంతమైన రాష్ట్రం, సమాజం కోసం అందరం చేతులు కలుపుదాం’ అని ట్విటర్లో పిలుపునిచ్చారు.

News November 29, 2024

క్రికెటేతర అథ్లెట్లకేదీ గౌరవం.?

image

ఫొటోలోని వ్యక్తి పేరు సర్వాన్ సింగ్. 1954 ఆసియా క్రీడల్లో భారత్‌కు స్వర్ణ పతకాన్ని తీసుకొచ్చారు. అయినా గుర్తింపు, ఉద్యోగం రాలేదు. బెంగాల్ ఇంజినీరింగ్ గ్రూప్‌ రెజిమెంట్‌లో చేరి 1970లో రిటైర్ అయ్యారు. బతుకుతెరువు కోసం గోల్డ్ మెడల్ అమ్మేసి ట్యాక్సీ కొనుక్కున్నారు. పేదరికంలోనే కన్నుమూశారు. నేటికీ క్రికెటేతర అథ్లెట్లలో చాలామందిది ఇలాంటి కథే. ఇతర క్రీడలకూ దేశంలో ప్రాధాన్యం దక్కాలన్నదానిపై మీ అభిప్రాయం?