News November 11, 2024
కులగణనపై కుట్రలను తిప్పికొట్టండి.. కార్యకర్తలకు పీసీసీ చీఫ్ పిలుపు

TG: కులగణనపై ప్రతిపక్షాల కుట్రలను ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని కాంగ్రెస్ శ్రేణులకు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ పిలుపునిచ్చారు. కులగణన చేపట్టి ఆయా కులాల జనాభాను బట్టి రిజర్వేషన్లు ఇస్తామని రాహుల్ గాంధీ కచ్చితమైన హామీ ఇచ్చారని గుర్తు చేశారు. ఎన్యుమరేటర్లతో పాటు కార్యకర్తలు కూడా ప్రజల ఇళ్లకు వెళ్లి సందేహాలను నివృత్తి చేయాలని సూచించారు.
Similar News
News March 28, 2026
ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు పెంపు.. మరో 4 రోజుల్లో అమల్లోకి

ఫాస్టాగ్ యాన్యువల్ పాస్ ఫీజు రూ.3,000 నుంచి రూ.3,075కి పెరగనుంది. ఫీజు పెంపు నిర్ణయం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని NHAI వెల్లడించింది. ప్రస్తుత ధరతో పాస్‌ను అప్‌గ్రేడ్ చేసుకునేందుకు మరో 4 రోజులే అవకాశం ఉందని పేర్కొంది. వన్ టైమ్ పేమెంట్‌తో ఏడాదిపాటు లేదా 200 ట్రిప్స్ ఎలాంటి అంతరాయం లేకుండా NHలపై ప్రయాణించవచ్చని తెలిపింది. రాజ్‌మార్గ్ యాత్ర యాప్ ద్వారా పాస్‌ను యాక్టివేట్ చేసుకోవాలంది.
News March 28, 2026
మోదీ-ట్రంప్ కాల్‌లో ఎలాన్ మస్క్ లేరు: కేంద్రం

ప్రధాని మోదీ, US ప్రెసిడెంట్ ట్రంప్ మధ్య జరిగిన ఫోన్ కాల్‌లో ఎలాన్ మస్క్ పాల్గొన్నట్లు వచ్చిన వార్తలను కేంద్ర విదేశాంగ శాఖ ప్రతినిధి ఖండించారు. ఈ నెల 24న మోదీ, ట్రంప్ మధ్య మాత్రమే టెలిఫోన్ సంభాషణ జరిగిందని స్పష్టం చేశారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై వారు మాట్లాడుకున్నారని తెలిపారు.
News March 28, 2026
కామరాజర్ పోర్టులో ఉద్యోగాలు.. దరఖాస్తుకు నేడే ఆఖరు తేదీ

చెన్నైలోని కామరాజర్ పోర్టు 14 జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు గడువు నేటితో ముగియనుంది. ఏదైనా డిగ్రీ, బీకామ్ అర్హత గలవారు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 30ఏళ్లు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. రాత పరీక్ష(CBT), DV, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. నెలకు జీతం రూ.25,250-రూ.50,500 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://kpl.cbtexam.in


