News August 28, 2024
Rewind: ఆగస్టు 28.. ఉలిక్కిపడ్డ హైదరాబాద్

28-08-2000 రోజు HYD ఉలిక్కిపడింది. విద్యుత్ ఛార్జీలు పెంచడాన్ని నిరసిస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్యక్రమం చేపట్టారు. ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరగానే పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చనిపోయారు. నేడు ఆ అమరులకు కామ్రేడ్‌లు నివాళి అర్పిస్తున్నారు.
Similar News
News December 19, 2025
HYDలో బ్రెడ్ క్రంబింగ్ ట్రెండ్.. బకరాలు లోడింగ్!

సిటీలో ప్రేమ ‘పెళ్లి’ దాకా వెళ్లడం లేదు.. గాల్లో దీపం పెట్టినట్లే ఉంది. పబ్‌లో పార్టీలు చేసుకుంటూ ఎదుటి మనిషికి అప్పుడప్పుడు ఓ మెసేజ్ పంపి, వాళ్లు రిప్లై ఇస్తే మళ్లీ రెండు రోజులు సైలెంట్ అయిపోవడమే ఈ కొత్త ట్రెండ్. తమ చుట్టూ తిప్పుకోవడానికి వేసే బిస్కెట్లు ఇవి. ఈ ట్రాప్‌లో పడి చాలా మంది మనసులు ముక్కలవుతున్నాయి. సో.. HYD యూత్.. ఆ ‘హాఫ్-హార్టెడ్’ లైకులను చూసి మురిసిపోకండి. బకరాగా మిగలకండి.
News December 19, 2025
హైదరాబాద్‌లో పెను మార్పు

గ్రేటర్ హైదరాబాద్ పాలనలో పెను మార్పులకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. పురపాలక శాఖకు (MA&UD) ఇద్దరు ప్రిన్సిపల్ సెక్రటరీలను నియమించాలని యోచిస్తోంది. వీరి పరిధిని (Jurisdiction) స్పష్టంగా విభజిస్తూ.. ఔటర్ రింగ్ రోడ్ (ORR) లోపల ఒకరు, బయట ప్రాంతాలపై మరొకరు బాధ్యతలు చేపట్టనున్నారు. భారీ స్థాయిలో ఐఏఎస్ అధికారుల బదిలీలకు రంగం సిద్ధమవుతున్న వేళ ఈ నిర్ణయం ప్రాధాన్యత సంతరించుకుంది.
News December 19, 2025
BREAKING: రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు

రంగారెడ్డి జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. 2018లో సరూర్‌నగర్ పరిధిలో 17 ఏళ్ల బాలికకు బలవంతపు పెళ్లి కేసులో పెళ్లి పెద్దగా వ్యవహరించిన బాలిక తండ్రికి రంగారెడ్డి జిల్లా కోర్టు జీవిత ఖైదు విధించింది. బాలిక భర్త, తండ్రికి రూ. 75వేల జరిమానా న్యాయమూర్తి వేశారు. బాధితురాలికి రూ.15లక్షల పరిహారాన్ని న్యాయమూర్తి మంజూరు చేశారు.


