News August 28, 2024

Rewind: ఆగస్టు 28.. ఉలిక్కిపడ్డ హైదరాబాద్

image

28-08-2000 రోజు HYD ఉలిక్కిపడింది. విద్యుత్ ఛార్జీలు పెంచ‌డాన్ని నిర‌సిస్తూ నాటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఛలో అసెంబ్లీ కార్య‌క్ర‌మం చేప‌ట్టారు. ర్యాలీ బషీర్‌బాగ్‌కు చేరగానే పరిస్థితి అదుపుతప్పింది. ఆందోళనకారులను అడ్డుకునేందుకు పోలీసులు లాఠీఛార్జి, టియర్ గ్యాస్, బుల్లెట్ల వర్షం కురిపించారు. ఈ కాల్పుల్లో రామకృష్ణ, విష్ణువర్ధన్, బాలస్వామి చనిపోయారు. నేడు ఆ అమరులకు కామ్రేడ్‌లు నివాళి అర్పిస్తున్నారు.

Similar News

News January 22, 2026

HYD: 500 మందిని ఉరితీసింది ఇక్కడే

image

‘కాలాపానీ’ అనగానే అండమాన్ గుర్తుకొస్తుంది. కానీ దాని రూపకల్పనకు మన HYDలోని ఓ జైలు ఆధారమైందన్న విషయం చాలామందికి తెలియదు. దీనిని సికింద్రాబాద్ తిరుమలగిరిలో 1858లో బ్రిటిష్ పాలకులు నిర్మించారు. 20,344 గజాల విస్తీర్ణంలో పచ్చీస్ ఆకారంలో, 75 చీకటి గదులతో ఈ కారాగారాన్ని కట్టించారు. ఇందులో 500 మందికిపైనే ఉరేశారు. 1994 వరకు జైలుగా వినియోగించారు. దీనినే నమూనాగా తీసుకుని 1906లో ‘కాలాపానీ’ని నిర్మించారు.

News January 22, 2026

HYD: ఇంటి వద్దే FIR.. ఈ కేసులకు మాత్రమే వర్తింపు

image

బాధితులకు సత్వర న్యాయం అందించడమే లక్ష్యంగా తెలంగాణ పోలీస్ శాఖ తీసుకున్న ఇంటికి వచ్చే FIR విధానాన్ని పకడ్బందీగా అమలు చేయనున్నట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. బుధవారం TGICCCలో ఆయన అవగాహన సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ.. ఆత్మహత్యలు, అసహజ మరణాలు, రోడ్డు ప్రమాదాలు, చోరీలు, దోపిడీలు, వాహన దొంగతనాలు, మహిళలు, పిల్లలపై నేరాలు, ర్యాగింగ్ వంటి ఘటనల్లో ఈ విధానం అమలు చేయనున్నట్లు చెప్పారు.

News January 22, 2026

HYD: మేడారం వెళ్తున్నారా..? 7658912300కి ‘HI’ పెట్టండి

image

మేడారం జాతరకు సంబంధించిన వివరాలను తెలుసుకునేందుకు ప్రభుత్వం తొలిసారి వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 7658912300 నంబర్‌కు ‘HI’ అని మెసేజ్ చేస్తే జాతర వివరాలను తెలుసుకోవడంతో పాటు పలు రకాల సేవలను పొందొచ్చు. జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానపు ఘట్టాలు సహా ఇతర వివరాలను నేరుగా వాట్సాప్‌లోనే చూడ