News April 25, 2024
REWIND: ఆలూరు ఏకైక మహిళా ఎమ్మెల్యే నీరజారెడ్డి
ఆలూరు నియోజకవర్గం మొదటి మహిళా ఎమ్మెల్యేగా నీరజారెడ్డి ఎన్నికయ్యారు. 1955 నుంచి 2019 వరకు ఎన్నికల వరకు అందరూ పురుషులే ఎమ్మెల్యేలు కాగా నీరజారెడ్డి మాత్రమే మహిళా ఎమ్మెల్యే కావడం గమనార్హం. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ప్రజారాజ్యం పార్టీ నుంచి బరిలో ఉన్న గుమ్మనూరు జయరాంపై విజయం సాధించారు. 2004లో మసాల పద్మజ, 2014లో కోట్ల సుజాతమ్మ కాంగ్రెస్, 2019లో టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయారు
Similar News
News January 19, 2025
ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయాలి: ఏఐవైఎఫ్
రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులను ప్రభుత్వం భర్తీ చేయాలని ఏఐవైఎఫ్ నంద్యాల జిల్లా కార్యదర్శి నాగరాముడు డిమాండ్ చేశారు. వచ్చే నెల 6, 7, 8, 9వ తేదీలలో శ్రీకాకుళంలో జరిగే ఏఐవైఎఫ్ 22వ రాష్ట్ర మహాసభలకు నంద్యాల జిల్లా నుంచి యువతీ, యువకులు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. శనివారం నంద్యాలలోని సీపీఐ కార్యాలయంలో నాయకులతో కలిసి కరపత్రాలను ఆవిష్కరించారు.
News January 18, 2025
పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లు ఆవిష్కరించిన కలెక్టర్
నంద్యాలలోని కలెక్టరేట్ కార్యాలయంలో ఉచిత పశు ఆరోగ్య శిబిరాల పోస్టర్లను శనివారం DAHO డా.గోవింద్ నాయక్‌తో కలిసి కలెక్టర్ జీ.రాజకుమారి ఆవిష్కరించారు. ఈనెల 20వ తేదీ నుంచి 31వ తేదీ వరకు జిల్లాలోని వివిధ గ్రామాల్లో నిర్వహించే ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలను పాడి రైతుల సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News January 18, 2025
ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి: కలెక్టర్
ప్రతి ఒక్కరూ తమ ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా పిలుపునిచ్చారు. శనివారం ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వచ్ఛ దివాస్’ కార్యక్రమంలో భాగంగా గూడూరు మండల కేంద్రంలోని అన్న క్యాంటీన్ ప్రాంగణంలో కోడుమూరు ఎమ్మెల్యే బొగ్గుల దస్తగిరితో కలిసి మొక్కలు నాటారు. అనంతరం అన్న క్యాంటీన్ నుంచి అంబేడ్కర్ సర్కిల్ వరకు అవగాహన ర్యాలీ చేపట్టారు.