News May 23, 2024
REWIND: ఎచ్చెర్లలో అత్యధికం, ఆముదాలవలసలో అత్యల్పం

2019 ఎన్నికలలో ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఎచ్చెర్లలో “NOTA”కు అత్యధిక ఓట్లు పడగా, ఆముదాలవలసలో అత్యల్ప ఓట్లు పడ్డాయి. ఈ మేరకు ఎచ్చెర్ల స్థానంలో “NOTA”ను 4,628 మంది ఎంచుకోగా, ఆముదాలవలస స్థానంలో 2,656 మంది “NOTA”కు ఓటేశారు. ఈ ఎన్నికల్లో శ్రీకాకుళం జిల్లాలో “NOTA” ఎన్ని ఓట్లు తెచ్చుకుంటుందో జూన్ 4న తెలియనుంది.
Similar News
News November 15, 2025
శ్రీకాకుళం: టుడే టాప్ న్యూస్

➤SKLM: క్రమశిక్షణ సమర్థతతో కోర్టు కానిస్టేబుళ్లు పనిచేయాలి
➤వ్యవసాయ రంగంలో AI వినియోగం: మంత్రి అచ్చెన్నాయుడు
➤పలాస, నరసన్నపేటలో 33 కేజీలు గంజాయి స్వాధీనం..నిందితులు అరెస్ట్
➤టెక్కలి: కంటి శస్త్ర చికిత్స విఫలం.. చూపు కోల్పోయిన వృద్ధుడు
➤సోంపేట: చెరువులో మునిగి యువకుడు మృతి
➤ఇచ్ఛాపురం: మత్స్యకారులు మధ్య ఘర్షణ.. పలువురికి గాయాలు
➤జిల్లాలో పలుచోట్ల ప్రారంభమైన వరి కోతలు
News November 15, 2025
ఎచ్చెర్ల: ‘వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం’

వ్యక్తిగత పరిశుభ్రతతోనే సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమవుతుందని డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ డాక్టర్ మేరీ క్యాథరిన్ అన్నారు. ఎచ్చెర్లలోని డాక్టర్ బి.ఆర్.అంబేడ్కర్ మహిళా గురుకుల పాఠశాల, జూనియర్ కళాశాలలో శనివారం విద్యార్థినులకు వ్యక్తిగత పారిశుద్ధ్యంపై అవగాహన కల్పించారు. చేతులు పరిశుభ్రంగా ఉంచుకోవాలని, రక్తహీనత లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, పరిసర ప్రాంతాల పరిశుభ్రంగా ఉండాలన్నారు.
News November 15, 2025
కోటబొమ్మాళి: భర్తకు అంత్యక్రియలు జరిపిన భార్య

కోటబొమ్మాళి మండలం జర్జంగి పంచాయతీలో గల గుంజులోవ గ్రామంలో విషాద ఘటన కలిచివేసింది. గ్రామానికి చెందిన తిర్లంగి లక్ష్మణరావు(40) అనారోగ్యంతో శుక్రవారం మృతి చెందారు. ఆయనకు పదేళ్లు కూడా నిండని ఇద్దరు కుమారులు ఉన్నారు. దీంతో భార్య తీర్లంగి రోహిణి భర్తకు అంత్యక్రియలు నిర్వహించారు. ఆ సమయంలో ఆమె ఆర్తనాదాలు మిన్నంటాయి. ఈ విషాద దృశ్యం అక్కడి వారి కంట కన్నీరు తెప్పించింది.


