News May 20, 2024
REWIND: ఓడిపోయిన రఘునందన్ రావు!

అసెంబ్లీ ఎన్నికలు BJP అభ్యర్థి రఘునందన్‌రావుకు కలిసి రావడం లేదనే చర్చ స్థానికంగా నడుస్తోంది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా 2020 ఉప ఎన్నికల్లో మాత్రం గెలిచారు. 2023లో 44,366 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. కాగా మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు ఈసారి తప్పకుండా గెలుస్తారని BJP శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండగా ఆయన గెలుస్తారో లేదో వేచి చూడాలి.
Similar News
News November 23, 2025
మెదక్: నేడు NMMS పరీక్ష

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.
News November 23, 2025
మెదక్‌లో JOBS.. APPLY NOW

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్‌లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్‌లో సమర్పించాలని తెలిపారు.
News November 23, 2025
మెదక్: హెల్ప్ డెస్క్ ద్వారానే ప్రజావాణి: కలెక్టర్

మెదక్ కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే ప్రజావాణి కార్యక్రమం ఈనెల 24న హెల్ప్ డెస్క్ ద్వారా మాత్రమే దరఖాస్తులను సమర్పించాలని కలెక్టర్ రాహుల్ రాజ్ సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల ఏర్పాట్లలో అధికారులు నిమగ్నమై ఎన్నికల అవగాహన సదస్సులో అధికారులు పాల్గొంటున్న కారణంగా ఆయా శాఖల అధికారులు ప్రజావాణికి అందుబాటులో ఉండాలని తెలిపారు.


