News May 20, 2024
REWIND: ఓడిపోయిన రఘునందన్ రావు!
అసెంబ్లీ ఎన్నికలు BJP అభ్యర్థి రఘునందన్‌రావుకు కలిసి రావడం లేదనే చర్చ స్థానికంగా నడుస్తోంది. 2014, 2018, 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ఓడిపోగా 2020 ఉప ఎన్నికల్లో మాత్రం గెలిచారు. 2023లో 44,366 ఓట్లు ఆయనకు పోలయ్యాయి. కాగా మెదక్ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసిన రఘునందన్ రావు ఈసారి తప్పకుండా గెలుస్తారని BJP శ్రేణులు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఇక్కడ త్రిముఖ పోటీ ఉండగా ఆయన గెలుస్తారో లేదో వేచి చూడాలి.
Similar News
News December 6, 2024
అంబేడ్కర్‌కు నివాళులు అర్పించకుండా నిర్బంధాలా..?: హరీశ్ రావు
రాష్ట్రంలో అప్పటికీ ఎమర్జెన్సీ కొనసాగుతుందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు X వేదికగా మండిపడ్డారు. ఈరోజు అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పించేందుకు వెళ్తున్న BRS నాయకులను ఎక్కడికక్కడ అరెస్టు చేయడం రేవంత్ రెడ్డి నిరంకుశ, నియంతృత్వ పాలనకు నిలువుటద్దమన్నారు. రాజ్యాంగ నిర్మాతకు నివాళులు అర్పించే స్వేచ్ఛ రాష్ట్రంలో లేదా అని నిలదీశారు. అదుపులోకి తీసుకున్న పార్టీ శ్రేణులను విడుదల చేయాలన్నారు.
News December 6, 2024
మెదక్: వేర్వేరు కారణాలతో నలుగురు సూసైడ్
వేర్వేరు కారణాలతో ఉమ్మడి జిల్లాలో నిన్న నలుగురు సూసైడ్ చేసుకున్నారు. తూప్రాన్ మం. నర్సంపల్లికి చెందిన శివ(24) ఇంట్లో ఊరేసుకోగా.. అక్కన్నపేట మం. అంతకపేటకు చెందిన ప్రకాశ్ భార్య పుట్టింటింకి వెళ్లిందన్న మనస్తాపంతో సూసైడ్ చేసుకున్నాడు. రాయపోల్‌కు చెందిన ఎరుపుల నర్సింలు(41) మద్యానికి బానిసై, కుటుంబ కలహాలతో పురుగుమందు తాగి చనిపోయాడు. పటాన్‌చెరు మం. ఇస్నాపూర్‌లో కార్మికుడు బహుద్దూర్ గదిలో ఉరేసుకున్నాడు.
News December 6, 2024
సంగారెడ్డి: రేపు ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 7న ఉమ్మడి జిల్లా క్రికెట్ జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు మెదక్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజేందర్ రెడ్డి తెలిపారు. సంగారెడ్డిలోని జూబ్లీ క్లబ్ ఆవరణలోని ఎంఎస్ అకాడమీలో ఉదయం 10 గంటల నుంచి ఎంపికలు జరుగనున్నాయి. జిల్లాలో ఎంపికైన క్రీడాకారులకు 16 న హైదరాబాద్లో జరిగే క్రికెట్ టోర్నమెంట్లో పాల్గొనాల్సి ఉంటదని చెప్పారు.