News November 29, 2024
REWIND: కరీంనగర్‌లో KCR అరెస్ట్.. NIMSలో దీక్ష విరమణ

ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష తెలంగాణ ఉద్యమానికి ఊపిరిపోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణభవన్ నుంచి సిద్దిపేటలోని దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించారు. జైలులో దీక్ష చేయగా ఆయన ఆరోగ్యం క్షీణించింది. వెంటనే NIMSకు తరలించారు. DEC 9న కేంద్రం నుంచి సానుకూల ప్రకటన రావడంతో KCR NIMSలో దీక్ష విరమించారు.
Similar News
News November 28, 2025
కరీంనగర్: NMMSS ‘కీ’ విడుదల

8వ తరగతి విద్యార్థులకు ఈనెల 23న నిర్వహించిన NMMSS స్కాలర్ షిప్ అర్హత పరీక్ష KEY విడుదలైందని కరీంనగర్ DEO మొండయ్య తెలిపారు. కీ పేపర్ పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 6 వరకు http/bse.telangana.gov.in సైట్‌లో లేదా dirgovexams.tg@gmail.comకి పంపాలని అన్నారు. లేదా డైరెక్టర్ ప్రభుత్వ పరీక్షలు, హైదరాబాద్ నందు సమర్పించాలని తెలిపారు. డిసెంబర్ 6 తరువాత వచ్చిన అభ్యంతరాలను స్వీకరించబడవని అన్నారు.
News November 28, 2025
ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు నిర్వహించాలి: సీపీ

సర్పంచ్ ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చినందున శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపడుతున్నట్లు కరీంనగర్ సీపీ గౌష్ ఆలం తెలిపారు. ఇందులో భాగంగా గతంలో నేర చరిత్ర ఉన్న ఎన్నికల నేరస్థులను బైండోవర్ చేస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా ఎన్నికలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్నీ చర్యలు చేపడతామని, ప్రజలు పోలీసులకు సహకరించాలన్నారు.
News November 28, 2025
KNR: శిశుగృహ, బాలసదనం నుంచి పిల్లల దత్తత

పిల్లలు లేని దంపతులు చట్టబద్ధమైన దత్తత తీసుకోవాలని కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. కరీంనగర్ శిశు గృహంలో పెరుగుతున్న 4నెలల వయసున్న ఆడ శిశువును హుస్నాబాద్‌కు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. బాలసదనంలో ఆశ్రయం పొందుతున్న 13సం.ల బాలికను తమిళనాడుకు చెందిన పిల్లలు లేని దంపతులు దత్తత తీసుకున్నారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ ఆధ్వర్యంలో కలెక్టర్ చేతుల మీదుగా దంపతులకు పిల్లలను దత్తత ఇచ్చారు.


