News December 26, 2024

REWIND: కృష్ణా జిల్లాలో పెను విషాదానికి 20 ఏళ్లు

image

ఉమ్మడి కృష్ణా జిల్లా ప్రజలకు 2004 సంవత్సరం పీడకలను మిగిల్చింది. పెను విధ్వంసంలో 27 మంది అసువులు బాసారు. సరిగ్గా నేటికి ఆ విషాద విపత్తు సంభవించి 20 ఏళ్లు. సునామీ సృష్టించిన భీభత్స అలల కారణంగా మంగినపూడి బీచ్ చూడటానికి వచ్చిన 27 మంది మరణించగా, వందల మంది గాయపడ్డారు. 4 మండలాలను సునామీ ముంచేయగా రూ.కోట్లల్లో ఆస్తి నష్టం వాటిల్లింది. ఎన్నో కుటుంబాలు నీట మునగ్గా, మరికొన్ని కుటుంబాలు రోడ్డున పడ్డాయి. 

Similar News

News November 17, 2025

కృష్ణా: ఖరీఫ్‌ పూర్తి.. అపరాల సాగు సిద్ధం

image

కృష్ణా జిల్లాలో ఖరీఫ్ వరి కోతలు దాదాపు సగానికి పైగా పూర్తయ్యాయి. రైతులు వెంటనే అపరాల సాగుకు సిద్ధమవుతున్నారు. అనేక మండలాల్లో పొలాలను శుభ్రం చేసి సాగుకు అనువుగా మారుస్తున్నారు. కొన్ని చోట్ల విత్తనాలు సేకరించి, విత్తడం కూడా ప్రారంభించారు. అయితే, మరోవైపు దాళ్వా సాగు చేయాలంటూ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలకు సిద్ధమవుతోంది.

News November 16, 2025

మీకోసంను సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

image

ప్రజా సమస్యల పరిష్కార వేదిక మీకోసం కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ డీకే బాలాజీ కోరారు. సోమవారం కలెక్టరేట్‌లో మీకోసం కార్యక్రమం నిర్వహించి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించడం జరుగుతుందన్నారు. ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అందజేస్తే తగు విచారణ జరిపి పరిష్కరిస్తామన్నారు.

News November 16, 2025

కృష్ణా: సోషల్ మీడియా పోస్టుపై స్పందించిన పోలీసులు

image

కృష్ణా జిల్లా పెడనలో జరగనున్న పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో శనివారం వ్యాపార సముదాయాల బహిరంగ వేలం పాటల నిర్వహణ జరిగింది. ఆ వేలం పాటకు హాజరైన పలువురి ఫొటోలను సోషల్ మీడియాలో పోస్టు చేస్తూ, “మొన్న ఢిల్లీలో జరిగింది.. నేడు గల్లీలో జరుగుతోంది” అంటూ వ్యాఖ్యానించిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.