News April 24, 2024
REWIND.. ఖమ్మంలో ఐదుగురు స్థానికేతరులు గెలుపు

ఖమ్మం లోక్ సభ ఎన్నికల్లో ఇప్పటివరకు ఐదుగురు స్థానికేతరులు ఎన్నిక కావటం విశేషం. PDFఅభ్యర్థిగా కర్ణాటకకి చెందిన టీబీ విఠల్రావు 1952, 1957, అలంపూర్కు చెందిన తేళ్ల లక్ష్మీకాంతమ్మ 1962, 67, 71, ఆంధ్రప్రదేశ్లోని అమలాపురానికి చెందిన పీవీ రంగయ్యనాయుడు 1991, గుంటూరు జిల్లాకు చెందిన నాదెండ్ల భాస్కర్రావు 1998, విశాఖపట్నానికి చెందిన రేణుకాచౌదరి 1999, 2004 ఎన్నికల్లో బరిలో నిలిచి విజయకేతనం ఎగురవేశారు.
Similar News
News November 24, 2025
KMM: సదరం సర్టిఫికెట్ ఉన్నా పెన్షన్ రాక ఆందోళన

ఖమ్మం జిల్లాలో సదరం సర్టిఫికెట్లు పొందిన వికలాంగులు రెండేళ్లుగా పెన్షన్లు మంజూరు కాక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పెన్షన్లు మంజూరు కాకపోగా, తీసుకున్న సర్టిఫికెట్ల గడువు ముగిసిపోతుండటంతో బాధితులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి, అర్హులైన వికలాంగులకు పెండింగ్లో ఉన్న పెన్షన్లను వెంటనే మంజూరు చేయాలని బాధితులు డిమాండ్ చేస్తున్నారు.
News November 24, 2025
ఖమ్మం: త్వరలో ఖాతాల్లోకి రైతు భరోసా నిధులు

అర్హులైన రైతుల ఖాతాల్లోకి ‘రైతు భరోసా’ పథకం కింద పెట్టుబడి సాయం త్వరలో జమ చేయనున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడించారు. భూమి ఉన్న రైతులతో పాటు, భూమి లేని వ్యవసాయ కార్మికులకూ ఎకరానికి సంవత్సరానికి రూ.12,000 చొప్పున ఈ సాయం అందిస్తామని ఆయన పేర్కొన్నారు. త్వరలో డబ్బులు జమ అవుతాయని మంత్రి భరోసా ఇచ్చారు.
News November 24, 2025
దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి: కలెక్టర్ అనుదీప్

ప్రజావాణి దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ అనుదీప్ అధికారులను ఆదేశించారు. పలు మండలాల నుంచి వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హులకు న్యాయం చేయాలన్నారు. ఎక్కువగా భూ సమస్యలు, పారిశుద్ధ్య, ప్రభుత్వ సంక్షేమ పథకాల కోసం దరఖాస్తులు వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లా నలుమూలల నుంచి పెద్దసంఖ్యలో ఫిర్యాదు చేయడానికి ప్రజావాణికి బాధితులు వచ్చారు.


