News March 26, 2024
REWIND: గుంటూరులో గల్లా జయదేవ్‌దే అత్యల్పం

గుంటూరు లోక్‌సభ నుంచి మహామహులు ఎన్నికయ్యారు. ఎన్జీ రంగా, లాల్ జాన్ బాషా, కొత్త రఘురామయ్య, రాయపాటి జయకేతనం ఎగురవేశారు. గత 2 పర్యాయాలు గల్లా జయదేవ్ ఇక్కడ విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో 69,111 ఓట్ల మెజార్టీతో గెలిచిన ఆయన.. 2019లో కేవలం 4,205 ఓట్లతో గట్టెక్కారు. ఈ లోక్‌సభ స్థానంలో ఇదే అత్యల్పం. ఈ ఎన్నికల్లో TDP కూటమి నుంచి పెమ్మసాని చంద్రశేఖర్, YCP నుంచి కిలారు రోశయ్య బరిలో దిగుతున్నారు.
Similar News
News April 19, 2025
జీజీహెచ్‌లో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి

గుంటూరులో ఒక వ్యక్తి ఇంటి కల విషాదంగా మారింది. పోలీసుల కథనం మేరకు.. ఫారూఖ్ ప్రగతినగర్‌లో తన ప్లాట్‌లో ఇంటి నిర్మాణానికి రాము అనే వ్యక్తికి రూ. 1 లక్ష ఇచ్చాడు. పనులు నెమ్మదిగా సాగడం, అడిగినా స్పందన లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన ఫారూఖ్, ఈ నెల 16న పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. జీజీహెచ్‌కు తరలించగా చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
News April 19, 2025
GNT: మానవత్వం చాటుకున్న లాలాపేట పోలీసులు

గుంటూరు తూర్పు నియోజకవర్గ పరిధిలోని లాలాపేట స్టేషన్ పోలీసులు మానవత్వం చాటుకున్నారు. శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో సంగడిగుంటలో ఏఎస్సై నరసింహారావు, కానిస్టేబుల్ నాగరాజు గస్తీ నిర్వహిస్తుండగా ఓ వ్యక్తి వచ్చి తన భార్య కాన్పు నొప్పులతో బాధపడుతుందని, వాహన సదుపాయం లేదని ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో గస్తీ పోలీసులు గర్భిణిని తమ వాహనంలో జీజీహెచ్ కాన్పుల వార్డుకు తరలించారు.
News April 19, 2025
GNT: ప్రధాని మోదీ పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన కలెక్టర్

ప్రధాని నరేంద్ర మోదీ మే 2న తుళ్ళూరు మండలం వెలగపూడి సచివాలయం సమీపంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు గుంటూరు కలెక్టర్ నాగలక్ష్మీ, ఎక్సైజ్ కమిషనర్ నీషాంత్ కుమార్, జేసీ భార్గవ్ తేజ, ఎంటీఎంసీ కమిషనర్ అలీబాషా, ఆర్డీవో కె.శ్రీనివాసరావు ఏర్పాట్లను శుక్రవారం పరిశీలించారు. నిబంధనలకు అనుగుణంగా హెలీప్యాడ్ ఏర్పాట్లు చేయాలని సూచించారు.