News March 24, 2024

REWIND: చంద్రగిరిలో TDP ఓటమికి కారణం అదే..!

image

చంద్రబాబుతో విభేదించి ఆయన తమ్ముడు రామ్మూర్తి నాయుడు 2004 ఎన్నికల ముందు కాంగ్రెస్‌లో చేరారు. చిత్తూరు ఎంపీ సీటు ఆశించినా దక్కలేదు. దీంతో చంద్రగిరి నుంచి ఇండిపెండెంట్‌ MLA అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఆ ఎన్నికల్లో గల్లా అరుణకుమారి కాంగ్రెస్ MLAగా 14,392 ఓట్ల మెజార్టీతో గెలిచారు. TDP అభ్యర్థి రామనాథం నాయుడుకు 32,2446 ఓట్లు పడ్డాయి. రామ్మూర్తికి ఏకంగా 31,525 ఓట్లు రావడంతో అక్కడ TDP ఓడిపోయింది.

Similar News

News December 9, 2025

చిత్తూరు: ముగిసిన పులుల గణన

image

జిల్లాలోని కౌండిన్య అభయారణ్యంలో పులుల గణన సోమవారం ముగిసింది. 4.87 లక్షల ఎకరాల విస్తీర్ణంలోని అటవీ ప్రాంతంలో చిత్తూరు ఈస్టు, వెస్టు, కార్వేటినగరం, పలమనేరు, పుంగనూరు, కుప్పం రేంజ్‌కు ఉన్నాయి. వీటి పరిధిలో 24 సెక్షన్లు, 84 బీట్ల సిబ్బంది గణన ప్రక్రియలో పాల్గొన్నారు. నాలుగేళ్లకోసారి ఈ గణనను అధికారులు నిర్వహిస్తున్నారు.

News December 9, 2025

చిత్తూరు జిల్లాలో మరో ఇద్దరికి స్క్రబ్ టైఫస్

image

చిత్తూరు జిల్లాలో సోమవారం మరో రెండు స్క్రబ్ టైఫస్ కేసులు బయట పడ్డాయి. జీడీనెల్లూరు మండలంలోని ముత్తుకూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి, తవణంపల్లి మండలం పల్లెచెరువు గ్రామానికి చెందిన మరో వ్యక్తి స్క్రబ్ టైఫస్‌తో బాధపడుతున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. బాధితులు చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

News December 9, 2025

చిత్తూరు పోలీసులకు 46 ఫిర్యాదులు

image

చిత్తూరు జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ తుషార్ డూడీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం జరిగింది. బాధితుల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. వివిధ సమస్యలపై 46 ఫిర్యాదుల అందినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా నగదు లావాదేవీలు 8, ఆస్తి తగాదాలు 7, భూతగాదాలు 7 ఫిర్యాదులు అందాయన్నారు. వీటిని సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ ఆదేశించారు.