News July 26, 2024
REWIND: చంద్రబాబుపై 17 కేసులు నమోదు
గురువారం అసెంబ్లీలో సీఎం చంద్రబాబు శాంతి భద్రతలపై శ్వేత పత్రం విడుదల చేశారు. ఇందులో గత ఐదేళ్ల వైసీపీ పాలనలో చంద్రబాబుపై 17 కేసులు నమోదు చేసినట్లు వెల్లడించారు. ఇందులో అత్యధికంగా సీఐడీ నమోదు చేసినవే కావడం గమనార్హం. వీటిలో అంగళ్లు అల్లర్లపై రెండు హత్యాయత్నం కేసులు కట్టారు. ఇవి అన్నీ కూడా అత్యధికంగా పుంగనూరు నియోజకవర్గంలోని స్టేషన్లలో నమోదయ్యాయన్నారు.
Similar News
News December 10, 2024
తిరుపతి కలెక్టర్‌కు 696 ఫిర్యాదులు
తిరుపతి జిల్లా వ్యాప్తంగా సోమవారం రెవెన్యూ సదస్సులు నిర్వహించినట్టు కలెక్టర్ వెంకటేశ్వర్ తెలిపారు. 32 సదస్సులలో సమస్యలపై 696 ఫిర్యాదులు అందినట్టు ఆయన వెల్లడించారు. ఇందులో కొన్ని సమస్యలు అక్కడికక్కడే పరిష్కరించగా.. మిగిలిన వాటిని సంబంధిత అధికారులు త్వరలోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోనున్నట్టు తెలిపారు.
News December 9, 2024
చంద్రగిరి: మహిళా అనుమానాస్పద మృతి
చంద్రగిరి మండలం ముంగిలపట్టులో కాసేపటి క్రితం ఓ గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. సాయంత్రం 6గంటల ప్రాంతంలో ఓ వ్యక్తితో కలిసి మహిళ ఏడుస్తూ కనిపించింది. చీకటి పడ్డాక నడి రోడ్డుపై రక్తపు మడుగులో మహిళ మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News December 9, 2024
తిరుపతిలో వ్యభిచారం గుట్టురట్టు
తిరుపతి రైల్వే కాలనీలో వ్యభిచారం కలకలం రేపింది. ఎర్రమిట్టకు చెందిన ఓ మహిళ రైల్వేకాలనీలో ఇంటిని బాడుగకు తీసుకుంది. ఇతర ప్రాంతాల నుంచి అమ్మాయిలను తీసుకు వచ్చి ఇక్కడ వ్యభిచారం నడుపుతోంది. పక్కా సమాచారంతో పోలీసులు దాడులు చేశారు. ఓటేరుకు చెందిన ఓ వ్యక్తితో పాటు అమ్మాయిలను పట్టుకున్నారు. ఈ మేరకు తిరుపతి తూర్పు పోలీస్ స్టేషన్ సీఐ రామకృష్ణ కేసు నమోదు చేశారు.