News January 18, 2025

Rewind: చౌటిపల్లెలో బస చేసిన సీనియర్ ఎన్టీఆర్

image

నందమూరి తారక రామారావు కొండాపురం మండలంలోని చౌటిపల్లెలో గతంలో బస చేశారు. 1982 ఏడాది చివరిలో తాడిపత్రి నుంచి చైతన్య రథంలో డ్రైవర్‌గా హరికృష్ణతో రామారావు రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో భాగంగా చౌటిపల్లె వద్ద గల చిత్రావతి నదిపై వాహనం మొరాయించడంతో అక్కడే అగి బస చేశారు. 1993 ఎన్నికల ప్రచారంలో కూడా పాత కొండాపురంలో టీ తాగారు. నేడు NTR 29వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను పలువరురు Rewind చేసుకున్నారు.

Similar News

News November 28, 2025

కడప జిల్లా ప్రజలకు తుఫాన్ హెచ్చరికలు

image

దిత్వా తుఫాను ప్రభావంతో శనివారం కడప జిల్లాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ నుంచి ప్రజల సెల్ ఫోన్‌కు మెసేజ్‌లు వస్తున్నాయి. బలమైన ఈదురుగాలులు వీస్తాయని అప్రమత్తంగా ఉండి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ముందస్తు సమాచారంతో వరి కోత పనులు నూర్పిడి చేసే రైతులు జాగ్రత్తలు పడుతున్నారు.

News November 28, 2025

కడప: 4న వాలీబాల్ సెలెక్షన్ ట్రైయిల్స్

image

దక్షిణ భారత అంతర విశ్వ విద్యాలయాల వాలీబాల్ పోటీలలో పాల్గొనబోయే విశ్వ విద్యాలయ వాలీబాల్ స్త్రీ, పురుషులు జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్ ట్రయల్స్ డిసెంబర్ 4వ తేదీ నిర్వహిస్తున్నారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్‌లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వ విద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తామని వైవీయు క్రీడా బోర్డు కార్యదర్శి డా. కొవ్వూరు రామసుబ్బారెడ్డి తెలిపారు.