News December 10, 2024
REWIND: ట్యాంక్‌బండ్‌లో విషాద గాథ తెలుసా?

సాగర్‌లో బుద్ధుడి విగ్రహ ప్రతిష్ఠలో పెను విషాదం జరిగింది. 1990 మార్చి 10న విగ్రహాన్ని HYDకు తీసుకొచ్చారు. పెద్ద పడవలో ఎక్కించి తీసుకెళ్తుండగా ఒక్కసారిగా అది కుదుపునకు గురైంది. విగ్రహం మెల్లిగా నీటిలోకి జారిపోవడంతో పడవలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక విగ్రహాన్ని వెలికితీసే సాహసం చేయలేదు. 1992లో నాటి CM కోట్ల విజయ భాస్కర్ రెడ్డి చొరవ చూపి డిసెంబర్ 1992లో వెలికి తీసి ప్రతిష్ఠించారు.
Similar News
News November 20, 2025
మాజీ సైనికులకు గుడ్ న్యూస్.. 28న జాబ్ మేళా

సైన్యంలో పనిచేసి పదవీ విరమణ చేసిన మాజీ సైనికోద్యోగులకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఎయిర్ ఫోర్స్ అధికారులు తెలిపారు. ఈ నెల 28వ తేదీన రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగులకు ఈ మేళా ఉంటుందన్నారు. వివిధ ప్రైవేటు సంస్థల్లో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు రక్షణ పౌర సంబంధాల అధికారి హరినాయక్ తెలిపారు. ఆసక్తిగల వారు www.dgrindia.gov.inలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు.
News November 20, 2025
మరోసారి అతిరథ మహారథులతో మెరిసిపోనున్న నగరం

భారతీయ కళా మహోత్సవం సెకండ్ ఎడిషన్‌కు రాష్ట్రపతి నిలయం వేదికకానుంది. 22- 30వ తేదీ వరకు ఈ కార్యక్రమాలు కొనసాగనున్నాయి. ఈ మహోత్సవ్‌లో పశ్చిమ రాష్ట్రాలైన మహరాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, గోవాలతో పాటు డామన్& డయ్యూ, దాద్రానగర్ హవేలీకి చెందిన ప్రదర్శనలు ఉంటాయి. ఆయా రాష్ట్రాలకు చెందిన వందలాది మంది కళాకారులు HYD రానున్నారు. కాగా, రేపు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రారంభించనున్నారు.
News November 20, 2025
HYDలో పక్షులు చూద్దామన్నా.. కనిపించట్లేదు!

HYD నుంచి ORR పరిసరాల్లో గతంలో అనేక రకాల పక్షులు కనపడేవి. అయితే ఇటీవల వలస పక్షుల సంచారం గణనీయంగా తగ్గిపోయింది. మారుతున్న వాతావరణం, వేగంగా పెరుగుతున్న పట్టణీరీకరణ, జలవనరుల తగ్గుదల, చెరువులు, కుంటలు తగ్గటం వంటి కారణాలు పక్షుల నివాసాలను ప్రభావితం చేస్తున్నాయి. పర్యావరణాన్ని కాపాడకపోతే జీవ వైవిధ్యం మరింత ప్రమాదంలో పడుతుందని పర్యావరణ ప్రేమికులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.


