News March 30, 2024
REWIND: నాడు 355 ఓట్ల మెజార్టీతో గన్నవరం ఎమ్మెల్యే

గన్నవరం నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 355 ఓట్ల మెజార్టీ అత్యల్పం. 1972లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.ఎస్.ఆనందబాయి ఇంత తక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు. ఇదే నియోజకవర్గంలో 1989లో 715 ఓట్లు, 1955లో 823 ఓట్లు, 2019లో 838 ఓట్ల మెజార్టీతో ముసునూరు రత్నబోస్, పి. సుందరయ్య, వల్లభనేని వంశీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి గన్నవరంలో వంశీ, యార్లగడ్డ వెంకట్రావు తలపడుతున్నారు.
Similar News
News December 19, 2025
నేరాల నివారణే లక్ష్యం.. పోలీసుల గస్తీ

కృష్ణా జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు రాత్రివేళ ముమ్మరంగా పెట్రోలింగ్ నిర్వహించారు. ప్రార్థనా స్థలాలు, ఏటీఎంలు, వ్యాపార కేంద్రాలను తనిఖీ చేస్తూ భద్రతపై నిఘా ఉంచారు. హైవేలపై డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించడంతో పాటు, ‘ఫేస్ వాష్ & గో’ కార్యక్రమం ద్వారా వాహనదారులకు రోడ్డు ప్రమాదాలపై అవగాహన కల్పించారు. ఆపద సమయంలో డయల్ 100ను ఆశ్రయించాలని పోలీసులు ప్రజలకు సూచించారు.
News December 18, 2025
మచిలీపట్నం: తీర ప్రాంత రక్షణపై ఎంపీ బాలశౌరి కసరత్తు

మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి బుధవారం కేంద్ర భూమి, శాస్త్ర మంత్రిత్వ శాఖ కార్యదర్శి ఎం.రవిచంద్రన్‌తో భేటీ అయ్యారు. కోడూరు అవుట్‌ఫాల్ స్లూయిస్ పునర్నిర్మాణం, చిన్నగొల్లపాలెం తీరప్రాంత కోత నివారణపై చర్చించారు. దీనిపై క్షేత్రస్థాయి సర్వే నిర్వహించి DPR సిద్ధం చేయాలని, నిధుల కోసం విపత్తు నిర్వహణ సంస్థలను సంప్రదించాలని కార్యదర్శి సూచించారు. ఈ చర్యలతో తీరప్రాంత గ్రామాలకు రక్షణ కల్పించే అవకాశం ఉంది.
News December 18, 2025
20న గుణదలలో జిల్లా జట్ల ఎంపికలు

కృష్ణా జిల్లా షూటింగ్ బాల్ సంఘం ఆధ్వర్యంలో డిసెంబర్ 20న గుణదలలో సీనియర్ పురుషుల, మహిళల జిల్లా జట్ల ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా షూటింగ్ బాల్ సంఘం అధ్యక్షులు రాజశేఖర్ తెలిపారు. జిల్లాలో ఆసక్తి గల క్రీడాకారులు ఎవరైనా ఒరిజినల్ ఆధార్‌తో హాజరు కావాలన్నారు. ఇక్కడ ఎంపికైన క్రీడాకారులు ప్రకాశం జిల్లా కరేడులో డిసెంబర్ 25, 26 తేదీలలో జరగబోయే రాష్ట్ర స్థాయి షూటింగ్ బాల్ పోటీలలో పాల్గొంటారన్నారు.


