News April 9, 2025
REWIND: నిర్మల్‌లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్‌లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News November 21, 2025
ప్రభాస్ ‘రాజాసాబ్’ నుంచి అప్డేట్

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా డైరెక్టర్ మారుతి తెరకెక్కిస్తోన్న ‘రాజాసాబ్’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ రిలీజ్‌పై అప్డేట్ వచ్చింది. ‘రెబల్ సాబ్’ అనే సాంగ్‌ను ఈనెల 23న విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ సందర్భంగా అదిరిపోయే పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 9న విడుదల కానున్న విషయం తెలిసిందే.
News November 21, 2025
యాదాద్రికి కార్తీక మాసంలో ₹17.62 కోట్ల ఆదాయం

యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి దేవస్థానానికి ఈసారి కార్తీక మాసంలో రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. నెల రోజులలో ఆలయానికి ₹17,62,33,331 చేరాయి. గత ఏడాదితో పోలిస్తే ఈసారి ₹3.31 కోట్లు అధికంగా లభించాయి. ఈ మాసంలో 24,447 సత్యనారాయణ స్వామి వ్రతాలు నిర్వహించినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
News November 21, 2025
కుసుమ ప్రతిభకు ఎమ్మెల్యే శ్రావణి సత్కారం

దక్షిణాఫ్రికాలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి, దేశ కీర్తిని చాటిన నార్పల మండలం దుగుమరి గ్రామానికి చెందిన 19 ఏళ్ల కుసుమను ఎమ్మెల్యే బండారు శ్రావణి అభినందించారు. కుసుమను, ఆమె కుటుంబ సభ్యులను తన క్యాంప్ కార్యాలయానికి ఆహ్వానించి, ఆర్థిక సాయం అందించారు. ఎవరెస్ట్‌ను అధిరోహించడమే తన లక్ష్యమని కుసుమ తెలపగా, కూటమి ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.


