News April 9, 2025
REWIND: నిర్మల్‌లో ఘోరం.. 1000 మందిని ఉరితీశారు.!

ప్రపంచంలో ఎక్కడా కనీవినీ ఎరగని రీతిలో నిర్మల్‌లో ఘోరం జరిగింది. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటం చేసిన రాంజీ గోండు, అతడి 1000 మంది అనుచరులను బంధించారు. 1860 ఏప్రిల్ 9న పట్టణంలోని ప్రస్తుతం కురన్నపేట్ దగ్గరున్న ఖజానా చెరువు వద్దనున్న ఊడలమర్రి చెట్టుకు ఒకేసారి ఉరితీసి చంపేశారు. ఇది జలియన్ వాలాబాగ్ కంటే అత్యంత భయంకరమని చరిత్రకారులు పేర్కొన్నారు. కాగా ప్రస్తుతం ఆ చెట్టు వర్షాలకు కూలిపోయింది.
Similar News
News April 22, 2025
గట్టు జూనియర్ కాలేజీలో మెరిసిన మాణిక్యం

గట్టు మండల కేంద్రంలోని ప్రభుత్వ గురుకుల జూనియర్ కాలేజీలో చదువుతున్న మహిన్ జవేరియా ఈ ఏడాది విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 440లో 432 మార్కులు సాధించి ప్రతిభను చాటింది. చిన్న కిరాణా షాప్ నడుపుకుంటూ విద్యను ప్రోత్సహించిన తల్లిదండ్రుల ఆత్మీయతకు మంచి ఫలితం వచ్చిందని గ్రామస్థులు తెలిపారు. మహిన్ సాధనకు ప్రశంసలు వెల్లువెత్తాయి. గ్రామస్థులు ఆమెకు శుభాకాంక్షలు తెలిపి స్వీట్లు పంపించి అభినందనలు తెలిపారు.
News April 22, 2025
తప్పు చేసినవారిపై చర్యలు తప్పవు: సీఎం సిద్దరామయ్య

కర్ణాటకలో ‘వింగ్ కమాండర్‌పై దాడి’ కేసులో దోషులపై చట్టప్రకారం చర్యలు తప్పవని ఆ రాష్ట్ర CM సిద్దరామయ్య స్పష్టం చేశారు. ‘కన్నడిగులు మాతృభాష పట్ల గర్విస్తారు. అలా అని ఇతర భాషల్ని ద్వేషించరు. దాడులు చేయరు. మాది అంతటి కుంచిత మనస్తత్వం కాదు. జాతీయ మీడియా మా గౌరవాన్ని దిగజార్చేలా వార్తలు వ్యాప్తి చేయడం దురదృష్టకరం. ఘటనపై సమగ్ర విచారణ చేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని పోలీసుల్ని ఆదేశించాను’ అని తెలిపారు.
News April 22, 2025
సివిల్స్‌లో చెన్నూరు యువకుడికి 151వ ర్యాంకు

యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్(సివిల్స్) ఫలితాల్లో కడప జిల్లా యువకుడు సత్తా చాటాడు. చెన్నూరుకు చెందిన నేలటూరు శ్రీకాంత్ రెడ్డికి 151వ ర్యాంకు వచ్చింది. మొదటి, రెండో ప్రయత్నంలో ప్రిలిమినరీ, మెయిన్స్ పాసయ్యారు. ఇంటర్వ్యూ వరకు వెళ్లినా సెలెక్ట్ కాలేదు. తాజా ఫలితాల్లో సివిల్స్ సాధించారు. ఇండోర్ ఐఐటీలో ఇంజినీరింగ్ పూర్తి చేశారు.