News March 28, 2024

REWIND: నెల్లూరు జిల్లాలో ఓడిపోయిన సినీనటి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేతలు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో 1999 ఎన్నికల్లో అదే సామాజికవర్గానికి చెందిన సినీనటి శారదను TDP రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ CM నేదురమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి తొలిసారి పోటీ చేశారు. 10,718 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. తాజా ఎన్నికల్లో YCP నుంచి ఆమె తనయుడు రాంకుమార్ రెడ్డి, TDP అభ్యర్థిగా సాయిలక్ష్మి ప్రియ బరిలో ఉన్నారు.

Similar News

News October 31, 2025

నెల్లూరు మెడికల్ కాలేజీలో ప్రవేశాలకు నోటిఫికేషన్

image

నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కాలేజీలో డిప్లొమా కోర్సులో రెండో విడత ప్రవేశాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. లోకల్ 85%, నాన్ లోకల్ అభ్యర్థులకు 15% సీట్లు కేటాయిస్తామని కాలేజీ ప్రిన్సిపల్ రాజేశ్వరి తెలిపారు. అభ్యర్థులు రూ.100 చెల్లించి అప్లికేషన్లు తీసుకోవాలని.. నవంబర్ 7వ తేదీ లోపు కాలేజీలో సమర్పించాలని సూచించారు. పూర్తి వివరాలకు spsnellore.ap.gov.in/notice/ వెబ్‌సైట్ చూడాలన్నారు.

News October 30, 2025

సోమశిలకు పెరుగుతున్న వరద

image

సోమశిల జలాశయానికి వరద ఉద్ధృతి కొనసాగుతోంది. 4 నుంచి 8 క్రస్ట్ గేట్లు ఎత్తి 77,650 క్యూసెక్కుల నీటిని పెన్నా డెల్టాకు విడుదల చేశారు. ప్రస్తుతం జలాశయానికి 78,460 క్యూసెక్కుల వరద వస్తోంది. అంతే మొత్తంలో కిందకు నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం నీటిమట్టం 72 టీఎంసీలకు చేరింది. పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు. వరద పెరుగుతుండటంతో పెన్నా పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరికలు చేశారు.

News October 30, 2025

నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు

image

నెల్లూరు జిల్లా ట్రెజరీ అధికారిగా శ్రీనివాసులు గురువారం మధ్యాహ్నం బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థలో ఖజానా విభాగం కీలకమైన పాత్ర పోషిస్తుందని ఆయన తెలిపారు. ఖజానా సిబ్బంది అందరి సమన్వయంతో బాధ్యతాయుతంగా పనిచేస్తానన్నారు. సిబ్బంది సంక్షేమానికి కృషి చేస్తానని తెలిపారు. ఆయనకు సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.