News March 8, 2025
Rewind: పల్నాడులో 23 మందిని చంపిన నిందితులకు క్షమాభిక్ష

32 ఏళ్ల క్రితం నరసరావుపేటలో 23 మందిని కాల్చి చంపేసిన ఘటనలో నిందితులు చలపతి, విజయవర్ధన్‌ను 1993 మార్చి 18న పోలీసులు అరెస్ట్ చేశారు. 96 ఆగస్టు 28న సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. 1997 మార్చి 29న వారి ఉరిశిక్షకు ఏర్పాట్లు చేశారు. వారు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్‌లో ఉండటంతో ఉరిశిక్ష వాయిదా వేయాలని సుప్రీమ్ ఆదేశించింది.
Similar News
News December 20, 2025
పెదవులు పగులుతున్నాయా? ఇది కూడా కారణం కావొచ్చు

శీతాకాలంలో చర్మం పొడిబారడం, పెదవులు పగలడం కామన్. అయితే వాతావరణం వల్ల మాత్రమే కాదు, శరీరంలో పోషకాలు లేకపోవడం వల్ల కూడా ఇలా జరుగుతుందని నిపుణులు అంటున్నారు. విటమిన్ బి12 లోపం వల్ల ఈ సమస్య ఎదురవుతుందంటున్నారు. దీనికోసం మాంసం, చేపలు, గుడ్లు, పాల ఉత్పత్తులు తీసుకోవాలని సూచిస్తున్నారు. శాకాహారులు పాలకూర, జున్ను, పాలు, తృణధాన్యాలు వంటివి ఆహారంలో చేర్చుకోవచ్చని చెబుతున్నారు.
News December 20, 2025
T20 వరల్డ్‌కప్‌కు భారత జట్టు ప్రకటన

వచ్చే ఏడాది ఫిబ్రవరి 7 నుంచి జరిగే టీ20 వరల్డ్ కప్‌కు బీసీసీఐ జట్టును ప్రకటించింది.
టీమ్: సూర్య (C), అక్షర్ పటేల్ (Vc), అభిషేక్, తిలక్, హార్దిక్, దూబే, రింకూ సింగ్, అర్ష్‌దీప్, హర్షిత్ రాణా, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, బుమ్రా, సుందర్, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్.
– వన్డే, టెస్ట్ జట్ల కెప్టెన్ గిల్‌కు చోటు దక్కలేదు
News December 20, 2025
నరసరావుపేట: అక్రమార్కుల్లో వణుకు.. PS వద్ద కార్లు పరార్.!

చిట్టినాయుడు కేసు దర్యాప్తు పల్నాడు జిల్లాలో ప్రకంపనలు సృష్టిస్తోంది. రోడ్డు ప్రమాద కేసులో ప్రధాన నిందితుడైన చిట్టినాయుడు వద్ద నుంచి కార్లు కొనుగోలు చేసిన వ్యక్తులు పోలీసుల తనిఖీలకు భయపడి, తమ వాహనాలను నరసరావుపేట పోలీస్ స్టేషన్ వద్దే వదిలి వెళ్తున్నారు. ఇప్పటికే పోలీసులు 25 కార్లను స్వాధీనం చేసుకోగా, తాజాగా గుర్తుతెలియని వ్యక్తులు కార్లను స్టేషన్ వద్ద వదిలివెళ్లడం చర్చనీయాంశంగా మారింది.


