News July 30, 2024
REWIND: ప్రజల మేస్త్రి.. రావి శాస్త్రి

తన మాటలు, రచనలతో ఉత్తరాంధ్ర మాండలిక విశిష్టతను జిల్లాకు చెందిన రావి శాస్త్రి (రాచకొండ విశ్వనాథశాస్త్రి) విశ్వవ్యాప్తి చేశారు. శ్రీకాకుళంలో 1922 జులై 30న జన్మించి, న్యాయవాది వృత్తిలో స్థిరపడి తన వద్దకు వచ్చే క్లయింట్లు, అణగారిన వర్గాలు, పేదల జీవితాలనే తన కథా వస్తువులుగా చేసుకొని ఎన్నో సృజనాత్మక, కవితాత్మక రచనలు చేశారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి ఎన్నో పురస్కారాలు, బిరుదులు అందుకున్నారు.
Similar News
News December 6, 2025
సారవకోట: మద్యం డబ్బుల కోసం గొడవ.. వ్యక్తి ఆత్మహత్య

మద్యానికి బానిసై ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన సారవకోట మండలంలో చోటుచేసుకుంది. పోలీసుల వివరాల మేరకు.. అలుదు గ్రామానికి చెందిన శంకర్రావు కొంతకాలంగా మద్యానికి బానిసయ్యాడు. మద్యం కోసం డబ్బులు ఇవ్వాలని భార్యను నిత్యం వేధించేవాడు. శుక్రవారం రాత్రి కూడా డబ్బులు అడగగా ఆమె నిరాకరించింది. దీంతో మనస్తాపానికి గురై ఉరేసుకున్నాడు. భార్య ఫిర్యాదు మేరకు ఎస్సై అనిల్ కుమార్ శనివారం కేసు నమోదు చేశారు.
News December 6, 2025
SKLM: వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదు

రిమ్స్ సర్వజన ఆసుపత్రిలో పనిచేస్తున్న సెక్యూరిటీ గార్డులు వేతనాలు చెల్లించకపోతే సమ్మెకు వెళ్లక తప్పదని IFTU జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గాసి గణేష్, జిల్లా కమిటీ సభ్యురాలు సవలాపురపు కృష్ణవేణీ అన్నారు. శనివారం కలెక్టర్ కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ సర్వజనీన ఆసుపత్రిలో శ్రీకార్తికేయ సెక్యూరిటీ సర్వీసెస్ యాజమాన్యం సుమారుగా 7 నెలలు కావస్తున్నా వేతనాలు చెల్లించడం లేదన్నారు.
News December 6, 2025
శబరిమలలో శ్రీకాకుళం జిల్లా వాసి మృతి

శబరిమలలో శ్రీకాకుళం రూరల్ మండలం రాగోలు పంచాయతీ కూటికుప్పలపేటకు చెందిన గురుగుబెల్లి వరాహ నరసింహులు (72) మృతి చెందారు. అయ్యప్ప దర్శనానికి వెళ్లగా శుక్రవారం గుండెపోటుతో మృతిచెందినట్లు తోటి భక్తులు మృతుని కుటుంబీకులకు సమాచారం ఇచ్చారు. అంబులెన్స్లో స్వగ్రామానికి మృతదేహాన్ని తీసుకువస్తున్నారు.


