News May 20, 2024
REWIND: బండి సంజయ్కు 89,016 ఓట్లు!

అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బండి సంజయ్కు ఎంపీ ఎన్నికలు కలిసొస్తాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోగా 89,016 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కూడా ఎంపీగా గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఉండగా బండి సంజయ్ గెలుస్తారో లేదో వేచి చూడాలి.
Similar News
News December 3, 2025
కరీంనగర్: యువకుడిపై పోలీసుల థర్డ్ డిగ్రీ..?

యువకుడిని రక్తం వచ్చేలా పోలీసులు విచక్షణారహితంగా కొట్టిన ఘటన కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. 24 గంటలపాటు పోలీసులు అధీనంలో ఉంచుకొని రాత్రి 9:30కు జైలుకు తరలించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ‘నా కొడుకు చేసిన నేరమేంటి? ఇంతగా ఎందుకు హింసిస్తున్నారు’ అంటూ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. దీనిపై CP జోక్యం చేసుకొని వాస్తవాలు వెల్లడించాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.
News December 3, 2025
గన్నేరువరం: ‘క్రీడల్లోనూ బాలికలు ముందుండాలి’

బాలికలు చదువుతో పాటు క్రీడల్లోనూ ముందుండి, అత్యుత్తమ ప్రతిభ కనబరచాలని అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే పేర్కొన్నారు. స్నేహిత అవగాహన కార్యక్రమంలో భాగంగా మంగళవారం తిమ్మాపూర్ కేజీబీవీ, గన్నేరువరం పాఠశాలలను ఆమె సందర్శించారు. అన్ని రంగాల్లోనూ ప్రతిభ చూపాలని బాలికలకు సూచించారు. ఏదైనా ఇబ్బంది ఉంటే వెంటనే హెల్ప్లైన్ నెంబర్లకు కాల్ చేయాలని కోరారు.
News December 3, 2025
KNR: సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన సీపీ

డిసెంబర్ 14న జరగనున్న సర్పంచ్, వార్డు సభ్యుల ఎన్నికల నేపథ్యంలో తిమ్మాపూర్, మానకొండూర్, శంకరపట్నం, చిగురుమామిడి, గన్నేరువరం మండలాలలో పోలింగ్ కేంద్రాన్ని కరీంనగర్ సీపీ గౌస్ ఆలం సందర్శించారు. ప్రశాంత వాతావరణంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటామని, ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఓటర్లు నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకోవాలని సీపీ విజ్ఞప్తి చేశారు.


