News May 20, 2024
REWIND: బండి సంజయ్‌కు 89,016 ఓట్లు!
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి చవిచూసిన బండి సంజయ్‌కు ఎంపీ ఎన్నికలు కలిసొస్తాయని స్థానికంగా చర్చ జరుగుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన బండి సంజయ్ 2019లో ఎంపీగా గెలిచారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఆయన ఓడిపోగా 89,016 ఓట్లు పోలయ్యాయి. అయితే ఈసారి కూడా ఎంపీగా గెలుస్తారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ స్థానంలో త్రిముఖ పోటీ ఉండగా బండి సంజయ్ గెలుస్తారో లేదో వేచి చూడాలి.
Similar News
News December 2, 2024
కోనరావుపేట: ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట
ప్రజా ఆరోగ్యానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు. రుద్రంగి, కోనరావుపేట మండలాలకు కేంద్రాలకు అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అంబులెన్స్ మంజూరు చేయడం పట్ల వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక ధన్యవాదాలు చెబుతున్నారు.
News December 2, 2024
ములుగులో ఎన్‌కౌంటర్.. మృతుల్లో పెద్దపల్లి వాసి..!
ములుగు జిల్లాలో ఆదివారం భారీ ఎన్‌కౌంటర్ జరిగిన విషయం తెలిసిందే. ఏడుగురు మావోయిస్టులు మృతి చెందారు. ఇందులో పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం రాణాపూర్‌కు చెందిన ఏగోలపు మల్లయ్య అలియాస్ కోటి(43)ఉన్నారు. కాగా, వారి మృతదేహాలు ములుగు జిల్లా ఏటూరునాగారం ఆసుపత్రిలో ఉన్నాయి. వారి కుటుంబ సభ్యులకు పోలీసులు సమాచారం అందజేశారు.
News December 2, 2024
KNR: కొయ్యూరు ఎన్‌కౌంటర్‌కు 25 ఏండ్లు
రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన కొయ్యూరు ఎన్‌కౌంటర్ జరిగి నేటికి 25 ఏండ్లు గడిచింది. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులైన నల్లా ఆదిరెడ్డి, ఎర్రం రెడ్డి సంతోష్ రెడ్డి, శీలం నరేశ్ ఈ ఎన్‌కౌంటర్‌లో మృతి చెందారు. దీనికి గుర్తుగా మావోయిస్టులు బేగంపేటలో స్మారక స్తూపం ఏర్పాటు చేశారు. మావోయిస్టులు డిసెంబర్ 2 నుంచి 9 వరకు పీఎల్జీఏ వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది.