News March 10, 2025

REWIND: భాగ్యనగరం.. భగ్గుమంది

image

10 మార్చి 2011 యాదుందా? సరిగ్గా 14 ఏళ్ల క్రితం భాగ్యనగరమంతా బారికేడ్లు.. పట్నమంతా పారామిలిటరీ బలగాలు.. అడుగడుగునా అరెస్టులు. అయినా దరువేస్తూ తెలంగాణ దండు కదిలింది. ట్యాంక్ బండ్ మీద కవాతు చేసింది. మలిదశ TG ఉద్యమాన్ని మలుపు తిప్పింది. అదే మిలియన్ మార్చ్. నిరోధాలను ఛేదించి చరిత్ర సృష్టించింది. ఆ రోజు తెలంగాణ కోసం పోరాడిన ప్రతీ అడుగూ ప్రత్యేక రాష్ట్ర కల నెరవేర్చుకునేందుకు సాకరమైంది.

Similar News

News December 8, 2025

ఫ్యూచర్ సిటీలోని ప్రదర్శన స్టాల్ వద్ద సందడి!

image

ఫ్యూచర్ సిటీలో ప్రదర్శన స్టాల్ ముఖ్య ఆకర్షణగా నిలిచింది. మీర్‌ఖాన్‌పేటలో ప్రతిపాదించిన ఈ భవిష్యత్తు నగర ప్రణాళికలను డిజిటల్ విజువల్స్ ద్వారా ప్రదర్శించారు. వంపు ఆకృతి నిర్మాణంతో కూడిన ఈ స్టాల్‌లో 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా రూపొందించిన మాస్టర్ ప్లాన్‌ను అధికారులు వివరించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్టాల్‌ను సందర్శించారు.

News December 8, 2025

రాష్ట్ర స్థాయిలో కడప జిల్లా జట్టు ఘన విజయం

image

గుంటూరులో జరుగుతున్న రాష్ట్ర స్థాయి విభిన్న ప్రతిభావంతుల క్రికెట్ పోటీల్లో ఈస్ట్ గోదావరిపై కడప జట్టు 26 పరుగుల తేడాతో గెలిచింది. కడప 16 ఓవర్లలో 171 పరుగులు చేయగా.. ఈస్ట్ గోదావరి 145 పరుగులకే ఆలౌటైంది. బ్యాటర్ ప్రవీణ్ 41 బంతుల్లో 85 పరుగులతో వీరవిహారం చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ వెంకటయ్య, వైస్ కెప్టెన్ సుబ్బరాయుడు ప్రవీణ్‌ను అభినందించారు. క్రీడాకారులను పలువురు ప్రశంసించారు.

News December 8, 2025

GNT: అలర్ట్..పరీక్షా ఫలితాలు విడుదల

image

ANU పరిధిలో గత సెప్టెంబర్ నెలలో జరిగిన బీఫార్మసీ మూడవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలను వర్సిటీ పరీక్షలు నియంత్రణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు సోమవారం విడుదల చేశారు. ఈ పరీక్షా ఫలితాల్లో విద్యార్థులు 34.39% ఉత్తీర్ణత సాధించారన్నారు. రీవాల్యుయేషన్ కోసం ఈ నెల 19వ తేదీ లోపు రూ. 2,070 నగదు చెల్లించాలన్నారు. పూర్తి వివరాలకు https://www.nagarjunauniversity.ac.in/ను సంప్రదించాలన్నారు.