News November 29, 2024

REWIND: మలిదశ ఉద్యమానికి పురుడుపోసిన ఖమ్మం గడ్డ!

image

తెలంగాణకు జరుగుతున్న అన్యాయాన్ని నిరసిస్తూ ప్రత్యేక రాష్ట్రం కోసం ఎన్నో ఉద్యమాలు జరిగాయి. కానీ మలిదశ ఉద్యమంలో భాగంగా KCR చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష ఉద్యమానికి ఊపిరి పోసింది. 29 NOV 2009లో కరీంనగర్‌లోని తెలంగాణ భవన్ నుంచి దీక్ష శిబిరానికి వెళుతుండగా అలుగునూర్ చౌరస్తా వద్ద KCRని అరెస్ట్ చేశారు. అక్కడి నుంచి ఖమ్మం తరలించగా ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసింది. నాటి కేసీఆర్ దీక్షతో తెలంగాణ సుభిక్షం అయింది.

Similar News

News December 5, 2025

బెల్టు షాపులపై దాడులు.. రూ.35 వేల మద్యం సీజ్

image

ఖమ్మం: గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పలు మండలాల్లోని బెల్టు షాపులపై టాస్క్‌ఫోర్స్‌ బృందాలు దాడులు నిర్వహించినట్లు ఏసీపీ సత్యనారాయణ తెలిపారు. కొణిజర్ల, రఘునాథపాలెం, చింతకాని సహా 7 మండలాల్లో దాడులు నిర్వహించి, సుమారు రూ.35 వేల విలువ గల దాదాపు 600 లీటర్లు ఐఎంఎఫ్‌ఎల్ మద్యాన్ని స్వాధీనం చేసుకుని కేసులు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు.

News December 5, 2025

కూసుమంచిలో అత్యధిక జీపీలు, వార్డులు

image

ఖమ్మం జిల్లాలో అత్యధిక జీపీలు, వార్డులు కూసుమంచి మండలంలో ఉన్నాయి. మండలంలో 41 జీపీలకు గాను 364 వార్డులు ఉన్నాయి. ఆ తర్వాత సింగరేణి మండలంలో 41 జీపీలు, 356 వార్డులు, తిరుమలాయపాలెం మండలంలో 40 జీపీలు 356 వార్డులు ఉన్నాయి. కూసుమంచి మండలంలో మొత్తం 50,357 మంది ఓటర్లకు గాను 24,321 మంది పురుషులు, 26,035 మంది మహిళలు ఇతరులు ఒకరు ఓటరుగా నమోదయ్యాయి.

News December 5, 2025

ఖమ్మం పెద్ద ఆస్పత్రిలో గర్భిణులకు తప్పని ప్రైవేటు బాట

image

ఖమ్మం మాతా శిశు ఆరోగ్య కేంద్రంలో రూ.30 లక్షల విలువైన టిఫా స్కానింగ్ సేవలు నిలిచిపోయాయి. దాదాపు ఏడదిన్నరగా రేడియాలజిస్ట్ లేకపోవడంతో ఈ కీలక సేవలు అందడం లేదు. శిశువు ఎదుగుదల తెలుసుకోవాల్సిన గర్భిణులు చేసేది లేక రూ.4,000 వరకు చెల్లించి ప్రైవేటు కేంద్రాలను ఆశ్రయిస్తున్నారు. పూర్తిస్థాయి రేడియాలజిస్ట్‌ను నియమించాలని గర్భిణులు కోరుతున్నారు.