News December 9, 2024

REWIND: మహాలక్ష్మి పథకంకి ఏడాది పూర్తి

image

మహాలక్ష్మి పథకం అమలై ఏడాది అవుతోంది. గతేడాది ముగ్గురు మంత్రులు భట్టి విక్రమార్క, తుమ్మల నాగేశ్వరరావు, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మొదటిసారిగా ఖమ్మం జిల్లాకు వచ్చి ఖమ్మం పాతబస్టాండ్‌లో మహాలక్ష్మి పథకాన్ని ప్రారంభించారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటి వరకు 4.30 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేశారు.  

Similar News

News December 10, 2025

ఖమ్మంలో కాంగ్రెస్‌కు ఏకగ్రీవాల జోరు

image

స్థానిక సంస్థల ఎన్నికల్లో భాగంగా మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఖమ్మం జిల్లాలో మొత్తం 21 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఇందులో కాంగ్రెస్ ఏకంగా 19 పంచాయతీలను దక్కించుకుంది. ముఖ్యంగా, మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వగ్రామం నారాయణపురం కూడా కాంగ్రెస్ అభ్యర్థి గొల్లమందల వెంకటేశ్వర్లు ఖాతాలో చేరింది. ఇప్పటివరకు మూడు విడతల్లో కాంగ్రెస్ మొత్తం 56 ఏకగ్రీవాలతో ముందంజలో ఉంది.

News December 10, 2025

పాల్వంచ వ్యక్తికి ఏడాది జైలు

image

చెక్ బౌన్స్ కేసులో భద్రాద్రి జిల్లా పాల్వంచకు చెందిన భాసబోయిన వేణుకు ఖమ్మం అదనపు కోర్టు ఏడాది జైలు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది. రఘునాథపాలెంకు చెందిన వ్యక్తి వద్ద 2022లో వేణు రూ.9.90 లక్షలు అప్పు తీసుకుని, తిరిగి చెల్లించేందుకు ఇచ్చిన చెక్కు చెల్లకపోవడంతో కేసు దాఖలైంది. న్యాయాధికారి బిందుప్రియ విచారణ అనంతరం ఈ తీర్పును వెలువరించారు.

News December 10, 2025

26 లోపు ఓపెన్ పరీక్ష ఫీజు చెల్లించాలి: DEO

image

పదోతరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు 2026 మార్చి, ఏప్రిల్‌లో నిర్వహించనున్నట్లు డీఈవో చైతన్య జైని తెలిపారు. అపరాధ రుసుము లేకుండా డిసెంబర్ 26 వరకు పరీక్ష ఫీజు చెల్లించాలన్నారు. థియరీకి టెన్త్‌కు రూ.100, ఇంటర్‌కు రూ.150 ఫీజుగా నిర్ణయించారు. తత్కాల్ స్కీంలో అదనంగా టెన్త్‌కు రూ.500, ఇంటర్‌కు రూ.1000 చెల్లించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.