News September 27, 2024

Rewind: మూసీ వరదలకు 116 ఏళ్లు!

image

HYD చరిత్రలో మూసీ వరదలు చెదరని ముద్ర వేశాయి. 1908 సెప్టెంబర్ 27 తెల్లవారుజామున క్లౌడ్‌ బరస్ట్ అయ్యింది. దాదాపు 36 గంటల పాటు భారీ వర్షం, వరదలు ముంచెత్తాయి. 28న మూసీ ఉగ్రరూపం దాల్చింది. వరదల్లో 50 వేల మంది నిరాశ్రయులు అయ్యారు. 15 వేల మంది చనిపోయినట్లు నాటి నిజాం పేర్కొన్నారు. ఇలాంటి విపత్తులు మరోసారి తలెత్తకుండా ఉస్మాన్ అలీఖాన్ ఆధ్వర్యంలో ఇంజినీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య జంటజలాశయాలను నిర్మించారు.

Similar News

News November 18, 2025

సికింద్రాబాద్ MRO ఆఫీసులో ఏసీబీ సోదాలు

image

సికింద్రాబాద్ ఎంఆర్ఓ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్‌గా సర్వేయర్ కిరణ్ పట్టుబడ్డాడు. ఎమ్మార్వో కార్యాలయంలో ఇంకా సోదాలు కొనసాగుతున్నాయి. సర్వేయర్ కిరణ్‌తో పాటు చిన్న మెన్ భాస్కర్లను కూడా ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

News November 18, 2025

సాంఘిక దురాచారాలపై పోరాటం అవసరం: చిన్నారెడ్డి

image

శాస్త్ర సాంకేతిక రంగంలో దూసుకెళ్తున్న ఈ ఆధునిక కాలంలోనూ దళితులు, గిరిజనులు, మహిళల పట్ల వివక్ష కొనసాగడం బాధాకరమని సీఎం ప్రజావాణి ఇన్‌ఛార్జి జి. చిన్నారెడ్డి అన్నారు. సాంఘిక దురాచారాలపై ప్రతి ఒక్కరూ సంఘటితంగా పోరాడాల్సిన బాధ్యత ఉందన్నారు. మంగళవారం ప్రజా భవన్‌లో సీఎం ప్రజావాణి, దళిత స్త్రీ శక్తి సంస్థ సంయుక్తంగా నిర్వహించిన లీగల్ క్లినిక్ ప్రత్యేక కార్యక్రమంలో చిన్నారెడ్డి మాట్లాడారు.

News November 18, 2025

HYD: జేఎన్టీయూలో వేడుకలు.. హాజరు కానున్న సీఎం

image

జేఎన్టీయూలో డైమండ్ జూబ్లీ, గ్లోబల్ అలుమ్నీ వేడుకలు 2 రోజుల పాటు వైభవంగా నిర్వహించనున్నారు. ఈనెల 21, 22 తేదీల్లో ఈ కార్యక్రమాలు నిర్వహించేందుకు వర్సిటీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అట్టహాసంగా జరిగే ఈ ఉత్సవాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతారని ప్రిన్సిపల్ డా.భ్రమర తెలిపారు. 21న సీఎం రేవంత్ రెడ్డి, 22న మంత్రి శ్రీధర్ బాబు ముఖ్య అతిథులుగా హాజరు అవుతారని పేర్కొన్నారు.