News April 24, 2024

REWIND: మెదక్ ఎంపీగా ఇందిరాగాంధీ ప్రధాని

image

1980 ఎన్నికల్లో మెదక్ ఎంపీగా గెలిచిన ఇందిరాగాంధీ నేతృత్వంలో ప్రభుత్వం కొలువుదీరింది. ఇక్కడ మొత్తం 4,45,289 ఓట్లు పోల్ కాగా 3,15,077 (67.9) శాతం ఇందిరాకే రావడం విశేషం. ఆమెకు జిల్లాలో విడదీయలేని బంధ ఉంది. ప్రధాని హోదాలో పలుమార్లు జిల్లాకు వచ్చారు. సంగారెడ్డిలో జడ్పీ సమావేశంలో, 1984 జులై 19న మెదక్‌లో జరిగిన సర్పంచుల సదస్సులో పాల్గొన్నారు. 1984 అక్టోబరు 31న హత్యకు గురైనప్పుడు మెదక్‌ ఎంపీగానే ఉన్నారు. 

Similar News

News January 18, 2025

BREAKING.. మెదక్: అన్నను చంపిన తమ్ముడు

image

మెదక్ జిల్లా శివంపేట మండలం నాను తండాలో తమ్ముడు అన్నను హత్య చేశాడు. గ్రామస్థుల వివరాల ప్రకారం.. తండాకు చెందిన అన్నదమ్ములు శంకర్ (28), గోపాల్ రాత్రి ఒకే రూంలో పడుకున్నారు. తెల్లవారుజామున అన్న కాలికి కరెంట్ వైర్ చుట్టి విద్యుత్ షాక్ పెట్టాడు. శంకర్ కేకలు వేయడంతో గోపాల్ పారిపోయాడు. తండ్రి వచ్చి చూసే వరకే శంకర్ మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.

News January 18, 2025

కంగ్టి: 60 సంవత్సరాలు పూర్తయిన సభ్యులకు సన్మానం

image

కంగ్టి మండల పరిధిలోని తడ్కల్ గ్రామపంచాయతీ కార్యాలయంలో శుక్రవారం గ్రామ సమైక్య సమావేశం నిర్వహించారు. డ్వాక్రా గ్రూప్లో 60 సంవత్సరాలు పూర్తయిన మహిళ మాజీ వార్డు సభ్యురాలు కుమ్మరి సత్యవ్వను గ్రామ సమాఖ్య ఆధ్వర్యంలో సన్మానించారు. సీసీలు రేణుక, కల్లప్ప, వివోఏలు సుమ, సవిత, వివో లీడర్లు మహిళ సమైక్య సభ్యులు పాల్గొన్నారు.

News January 18, 2025

సంగారెడ్డి: గర్భం దాల్చిన బాలిక

image

మతిస్థిమితం లేని బాలిక గర్భం దాల్చిన ఘటన హత్నూర(M)లో అలస్యంగా వెలుగులోని వచ్చింది. స్థానికుల ప్రకారం.. ఓ గ్రామానికి చెందిన బాలిక 9వ తరగతి చదివి ఇంటి వద్దే ఉంటోంది. తల్లిదండ్రులు కూలీ పనుల కోసం వెళ్లగా ఒంటరిగా ఉన్న బాలికపై కొందరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. దీంతో ఆమె గర్భం దాల్చింది. 7 నెలల గర్భవతి కావడంతో విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారులు వైద్యం అందిస్తున్నారు. కేసు నమోదు కాలేదు.