News March 20, 2024
REWIND: వంగా గీతకు 169 ఓట్లు

వంగా గీత 1994లో పిఠాపురం నుంచి పోటీ చేశారు. TDPలో వర్గపోరుతో తొలుత ఆమెను అభ్యర్థిగా ప్రకటించినా బీఫారం వెన్నా నాగేశ్వర రావుకు అందించారు. అప్పట్లో ఆమెకు చంద్రబాబు, బాలయోగి ఆశీస్సులు ఉన్నా టికెట్ దక్కలేదు. నామినేషన్ తర్వాత బీఫారం కోసం చివరి వరకు ఆమె హైదరాబాద్లో ఉండటంతో దాన్ని ఉపసంహరించుకునే ఛాన్స్ దక్కలేదు. ఆమె పేరు బ్యాలెట్ పేపర్ మీద ఉన్నా ఎటువంటి ప్రచారం చేయలేదు. అయినా 169 ఓట్లు దక్కాయి.
Similar News
News December 16, 2025
విద్యుత్.. అమూల్య సంపద: కలెక్టర్

జాతీయ ఇంధన వారోత్సవాల సందర్భంగా రాజమండ్రి కలెక్టరేట్లో మంగళవారం తూర్పు గోదావరి కలెక్టర్ కీర్తి చేకూరి ప్రచార చిత్రాలను ఆవిష్కరించారు. విద్యుత్ను కేవలం ప్రకృతి వనరుగా కాకుండా, అమూల్యమైన సంపదగా భావించాలని ప్రజలకు ఆమె హితవు పలికారు. అవసరమైన మేరకే వినియోగిస్తూ, ఇంధన పొదుపును ప్రతి ఒక్కరూ బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ పిలుపునిచ్చారు.
News December 16, 2025
గోపాలపురం: వెంటాడుతూనే వున్న పెద్దపులి భయం

గోపాలపురం మండలం భీమోలు పరిసర ప్రాంతాల్లో పెద్దపులి సంచారంపై ఉత్కంఠ కొనసాగుతోంది. పులి ఆచూకీ కోసం కొండ ప్రాంతంలో అటవీ శాఖ అధికారులు ఆరు ట్రాకింగ్ కెమెరాలను ఏర్పాటు చేసి గాలింపు ముమ్మరం చేశారు. ఇప్పటివరకు కెమెరాల్లో పులి జాడలు లభించలేదని డీఎఫ్ఓ దావీదు రాజు సోమవారం తెలిపారు. పులి ఇంకా పరిసరాల్లోనే ఉండే అవకాశం ఉన్నందున గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు.
News December 15, 2025
రాజమండ్రి: పీజీఆర్ఎస్కు 23 అర్జీలు

తూర్పుగోదావరి జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు 23 అర్జీలు అందాయి. జిల్లా ఎస్పీ డి.నరసింహ కిషోర్ స్వయంగా బాధితుల నుంచి వినతులు స్వీకరించారు. సమస్యల తీవ్రతను బట్టి సంబంధిత పోలీసు స్టేషన్ల అధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు అడిగి తెలుసుకున్నారు. చట్టపరంగా విచారణ జరిపి, బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని అధికారులను ఆదేశించారు.


