News May 21, 2024
REWIND: వరంగల్‌లో స్పష్టమైన మెజార్టీ సాధించిన కాంగ్రెస్
WGL లోక్‌సభ నియోజకవర్గపరిధిలోని 7 అసెంబ్లీ స్థానాల్లో 6 చోట్ల కాంగ్రెస్ విజయం సాధించగా.. 1 చోట బీఆర్ఎస్ విజయం సాధించింది. ఓవరాల్‌గా కాంగ్రెస్ 1,58,715 ఓట్ల మెజార్టీ సాధించగా.. బీఆర్ఎస్ 7,779 సాధించింది. కొన్నిచోట్ల మినహా చాలా చోట్ల బీజేపీ 3 స్థానానికి పరిమితమైంది. ప్రస్తుత ఓటింగ్ కలిసోస్తుందని కాంగ్రెస్ భావిస్తుంటే.. బీఆర్ఎస్, బీజేపీ మాత్రం రాజకీయ సమీకరణాలు మారాయని అంటున్నాయి.
– దీనిపై మీ కామెంట్
Similar News
News December 7, 2024
ఇందిరమ్మ ఇళ్లపై జనగామ కలెక్టర్ కీలక ఆదేశాలు
ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద అర్హులైన లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని జనగామ కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్‌లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీడీవో, ఎంపీవో, పంచాయతీ సెక్రటరీలకు ఇందిరమ్మ ఇళ్ల పథకంపై కలెక్టర్ అవగాహన కల్పించారు. లబ్ధిదారుల గుర్తింపు కోసం క్షేత్రస్థాయిలో చేపట్టే సర్వే పకడ్బందీగా నిర్వహించాలన్నారు.
News December 6, 2024
గిరిజన యూనివర్సిటీకి రూ.890 కోట్లు మంజూరు: మహబూబాబాద్ ఎంపీ
మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ కృషి ఫలించింది. ఎంపీ చొరవతో ములుగు గిరిజన విశ్వ విద్యాలయం కోసం కేంద్రం రూ.890 కోట్లు మంజూరు చేసింది. విభజన చట్టంలో భాగంగా తెలంగాణలో నెలకొల్పిన సమ్మక్క- సారక్క గిరిజన విశ్వవిద్యాలయం కోసం కేంద్రంపై ఒత్తిడి చేసి పార్లమెంట్‌లో రూ.890 కోట్ల బడ్జెట్ రిలీజ్ చేయించినట్లు ఎంపీ ‘X’ (ట్విట్టర్) ద్వారా తెలిపారు. దీంతో గిరిజన విద్యార్థులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News December 6, 2024
వరంగల్ భద్రకాళి అమ్మవారికి పూజలు
వరంగల్ నగరంలోని భద్రకాళి అమ్మవారికి అర్చకులు ఈరోజు అభిషేకం నిర్వహించారు. నేడు అమ్మవారికి ప్రీతికరమైన రోజు శుక్రవారం కావడంతో తెల్లవారుజామునే ఆలయాన్ని తెరిచి, అమ్మవారికి అభిషేకం నిర్వహించి పూజా కార్యక్రమాలు చేపట్టారు. చుట్టుపక్క ప్రాంతాల మహిళలు, భక్తులు సైతం ఉదయాన్నే అధిక సంఖ్యలో ఆలయానికి తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని, తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తున్నారు.