News November 30, 2024

REWIND: వరంగల్‌లో 15 ఏళ్ల క్రితం అరెస్టయ్యా: KTR

image

మాజీ మంత్రి, సిరిసిల్ల MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు.  ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.

Similar News

News December 7, 2025

WGL: పంచాయతీ ఎన్నికల సమాచారం లోపం.. మీడియాకు ఇబ్బందులు!

image

జిల్లాలో GP ఎన్నికల వివరాలు పత్రికలు, మీడియాకు చేరవేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనా, అర్ధరాత్రి వివరాలు ఇస్తామని DPO చెప్పగా, సమాచార శాఖ పాత డేటానే పంపడంతో తాజా సమాచారం మాయం అయింది. గతంలో 50 మండలాల డేటాను సమయానికి అందించిన యంత్రాంగం, ఇప్పుడు 11 మండలాల వివరాలకే తంటాలు పడుతోంది. వాట్సాప్‌కే పరిమితమైన సమాచార పంపిణీతో ఇబ్బందవుతోంది.

News December 7, 2025

మూడు విడతలు పూర్తయ్యే వరకు కోడ్ అమలు: కలెక్టర్

image

గ్రామ పంచాయతీ ఎన్నికలు మూడు విడతలు ముగిసే వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ అమలులో ఉంటుందని గఎన్నికల అధికారి, కలెక్టర్ సత్య శారద తెలిపారు. ఈ నెల 11, 14, 17 తేదీల్లో మూడు దశల్లో ఎన్నికలు జరుగుతున్నందున, చివరి దశ పూర్తయ్యే వరకు కోడ్ కొనసాగుతుందన్నారు. ఏకగ్రీవ పంచాయతీలకు కూడా కోడ్ వర్తిస్తుందని, ఉల్లంఘనలపై చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 5, 2025

ఎన్నికలు పకడ్బందీగా నిర్వహించాలి: రాణి కుముదిని

image

సాధారణ గ్రామ పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అన్నారు. హైదరాబాద్ నుంచి రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాణి కుముదిని కలెక్టర్లు, ఎన్నికల పరిశీలకులు, పోలీస్ అధికారులతో ఎన్నికల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో నర్సంపేట ఆర్డీవో కార్యాలయం నుంచి కలెక్టర్ డాక్టర్ సత్య శారద పాల్గొన్నారు.