News November 30, 2024
REWIND: వరంగల్‌లో 15 ఏళ్ల క్రితం అరెస్టయ్యా: KTR
మాజీ మంత్రి, సిరిసిల్ల MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News December 11, 2024
KNR: గ్రూప్-2 పరీక్ష పకడ్బందీగా నిర్వహించాలి: కలెక్టర్
ఈనెల 15, 16వ తేదీల్లో గ్రూప్-2 పరీక్షను జిల్లాలో పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. గ్రూప్-2 పరీక్షకు విధులు కేటాయించిన అధికారులకు బుధవారం కలెక్టరేట్ ఆడిటోరియంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరై కలెక్టర్ మాట్లాడుతూ.. అభ్యర్థులు నిర్ణీత సమయంలోగా పరీక్ష కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఆలస్యంగా వస్తే ఎట్టి పరిస్థితుల్లో అనుమతించరాదన్నారు.
News December 11, 2024
సిరిసిల్ల: ఉచిత శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు: ఎస్పీ
సిరిసిల్ల పట్టణంలో పోలీస్ శాఖ ఆధ్వర్యంలో 3 నెలల పాటు సీసీటీవీ ఇన్‌స్టాలేషన్, సాఫ్ట్ స్కిల్స్, కంప్యూటర్ శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ తెలిపారు. టెన్త్ సర్టిఫికెట్‌తో ఈనెల 12 నుంచి 15 వరకు వారి పరిధి పోలీస్ స్టేషన్‌లో తమ పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. శిక్షణతో పాటు ఉపాధి అవకాశాలు కూడా ఉంటాయని ఆయన పేర్కొన్నారు.
News December 11, 2024
ఎల్లారెడ్డిపేట: గుండెపోటుతో రైతు మృతి
ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్ గ్రామానికి చెందిన రైతు గుండెపోటుతో మృతి చెందారు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. రైతు చిందు శంకర్ (50) వ్యవసాయ పొలం వద్ద పనులు చేసి ఇంటికి వచ్చి నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో ఛాతిలో నొప్పి అంటూ కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వడంతో ఆసుపత్రికి తరలించే లోపే మృతి చెందాడు. శంకర్‌కు భార్య పద్మ, కుమారులు శ్రీనివాస్ శ్రీకాంత్, కుమార్తె ఉన్నారు.