News November 30, 2024
REWIND: వరంగల్‌లో 15 ఏళ్ల క్రితం అరెస్టయ్యా: KTR
మాజీ మంత్రి, సిరిసిల్ల MLA KTR తన గతాన్ని గుర్తు చేసుకుంటూ శనివారం ఓ ఆసక్తికర ట్వీట్ చేశారు. ‘15 ఏళ్ల క్రితం ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో పాల్గొని నవంబర్ 29న అరెస్ట్ అయ్యా. నన్ను వరంగల్ సెంట్రల్ జైలుకు తరలించారు. తెలంగాణ స్వరాష్ట్ర ఉద్యమంలో జరిగిన ఈ ఘటన నాకు జీవితాంతం గుర్తుంటుంది. ప్రజల శ్రేయస్సు కోసమే నిత్యం కృషి చేస్తాను’ అని KTR ‘X’లో పోస్ట్ చేశారు.
Similar News
News December 2, 2024
ములుగు: నేటి నుంచి మావోయిస్టు వారోత్సవాలు
నేటి నుంచి మావోయిస్టు PLGA వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. ప్రతి సంవత్సరం డిసెంబర్ 2- 8వ తేదీ వరకు వారం రోజులపాటు వారోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. భూపాలపల్లి జిల్లా కొయ్యూరు వద్ద జరిగిన ఎన్‌కౌంటర్లో అప్పటి అగ్రనేతలు నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్, ఎర్రంరెడ్డి సంతోశ్ రెడ్డి మృత్యువాత పడ్డారు. వారి గుర్తుగా వారోత్సవాలు నిర్వహిస్తారు. కాగా, ఏజెన్సీలో హై అలర్ట్ నెలకొంది.
News December 1, 2024
నెక్కొండ: విఫలమైన ఆన్‌లైన్ ప్రేమ.. యువకుడు సూసైడ్
ప్రేమ విఫలమై ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నెక్కొండ మండలంలో జరిగింది. అప్పలరావుపేటకి చెందిన వినయ్ (25) HYDలో ఓ ప్రైవేటు కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. కొన్ని రోజుల క్రితం అతనికి ఆన్‌లైన్‌లో యువతి పరిచయం కాగా..అది కాస్త ప్రేమగా మారింది. ఇటీవల ఆ యువతికి వేరే వ్యక్తితో పెళ్లి కుదిరింది. దీంతో యువకుడు 5రోజుల క్రితం పురుగులమందు తాగి ఆత్మహత్యకు యత్నించాడు. చికిత్స పొందుతూ మృతిచెందాడు.
News December 1, 2024
ములుగు: ఎన్‌కౌంటర్‌తో ఉలిక్కిపడ్డ ఏజెన్సీ
ములుగు జిల్లా చల్పాక అడవుల్లో జరిగిన భారీ ఎన్‌కౌంటర్‌తో ఏజెన్సీ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. ఏటూరునాగారం మండలానికి సమీప అడవుల్లోనే జరగడం చర్చనీయాంశంగా మారింది. మావోయిస్టులు తెలంగాణలోకి తలదాచుకునేందుకు వచ్చారా? లేక రేపటి నుంచి జరగనున్న వారోత్సవాల కోసం తమ ఉనికి చాటుకునేందుకు వచ్చారా అనేది తెలియాల్సి ఉంది.