News May 8, 2024

REWIND: సర్వేపల్లిలో మూడో స్థానంలో నోటా

image

సర్వేపల్లిలో 2019 ఎన్నికలు హోరాహోరీగా సాగాయి. ఆ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై వైసీపీ అభ్యర్థి కాకాణి గోవర్ధన్ రెడ్డి 13973 ఓట్ల మెజార్టీతో గెలిచారు. నోటా 2782 ఓట్లతో మూడో స్థానంలో నిలవడం విశేషం. ఆ తర్వాత స్థానాల్లో జనసేన(1913 ఓట్లు), కాంగ్రెస్(1420), బీజేపీ(1420) అభ్యర్థులు నిలిచారు. 5, 6 స్థానాలకు పరిమితమైన జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీకి సమాన ఓట్లు దక్కాయి.

Similar News

News September 30, 2024

నెల్లూరులో రైలు ఢీకొని మహిళ మృతి

image

నెల్లూరు రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి గూడ్స్ ట్రైన్ ఢీకొని ఓ మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన రైల్వే పోలీసుకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉంది.

News September 30, 2024

నెల్లూరు: RTC బస్సు ఢీకొని వ్యక్తి స్పాట్ డెడ్

image

సంగం- కొరిమెర్ల మార్గమధ్యంలో రోడ్డు మలుపు వద్ద ఆదివారం రాత్రి ప్రమాదం జరిగింది. విడవలూరు మండలం అన్నారెడ్డిపాళెంకు చెందిన నరసింహరావు(24) ఏఎస్ పేటలో జరిగే గంధమహోత్సవానికి బైక్‌పై వెళ్తుండగా సంగం- కలిగిరి రహదారిలోని మలుపు వద్ద ఎదురుగా వస్తున్న ఆర్‌టీసీ బస్ ఢీకొట్టింది. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేశారు.

News September 29, 2024

గూడూరులో దారుణం.. విద్యార్థిపైకి దూసుకెళ్లిన కారు

image

గూడూరు పట్టణ పరిధిలోని SKR ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. వంశీ అనే యువకుడు డ్రైవింగ్ నేర్చుకుంటున్న సమయంలో అదుపుతప్పి విద్యార్థిపైకి కారు దూసుకెళ్లింది. దీంతో తీవ్ర గాయాలపాలైన లీలా విక్షత్ (11) అనే విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి పట్టణంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఆరో తరగతి చదువుతున్నట్లు సమాచారం. వంశీని అదుపులోకి తీసుకొని పోలీసులు విచారణ చేపట్టారు.