News December 27, 2024
REWIND: హైదరాబాదీల మనసు గెలిచారు..

మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ నిన్న రాత్రి కన్నుమూసిన విషయం తెలిసిందే. HYD విశ్వనగరంగా అభివృద్ధి చెందడంలో ఆయన సహకారం కీలకంగా ఉంది. కాగా.. 2013లో దిల్సుఖ్నగర్లోని కోణార్క్, వెంకటాద్రి థియేటర్ల వద్ద జరిగిన బాంబ్ బ్లాస్ట్లు దేశాన్ని ఉలిక్కిపడేలా చేశాయి. ఆ సమయంలో ప్రధానిగా ఉన్న ఆయన ఇక్కడ పర్యటించి ‘భయపడకండి’ అని బాధితులు, నగరవాసులకు ధైర్యం కల్పించారు. ఈ పర్యటనతో ఆయన హైదరాబాదీల మనసు గెలుచుకున్నారు.
Similar News
News December 1, 2025
HYD: RRRకు సర్వీస్ రోడ్డు లేదు!

సాధారణంగా ఔటర్ రింగ్ రోడ్డుకు సర్వీస్ రోడ్లు ఉంటాయి. అయితే గ్రేటర్ HYD చుట్టూ నిర్మిస్తున్న RRRకు సర్వీస్ రోడ్డు నిర్మించడం లేదు. దీనికి బదులు యాక్సిస్ పాత్ రోడ్లు నిర్మించాలని NHAI నిర్ణయించింది. కనెక్టివిటీని పెంచడంతోపాటు సులువుగా ఉండేలా నిర్ణయం తీసుకుంది. ఆర్ఆర్ఆర్ చుట్టూ ఎక్కువగా పొలాలు ఉండటంతో ఈమేరకు నిర్ణయం తీసుకుంది. ఈ రోడ్లతో రైతులకు పొలాలకు కూడా వెళ్లేందుకు వీలుగా ఉండనుంది.
News December 1, 2025
HYD: గ్లోబల్ సమ్మిట్ విజన్ డాక్యుమెంట్.. ఇదీ సీఎం ప్లాన్

ఈ నెల 8,9 తేదీలల్లో జరగనున్న గ్లోబల్ సమ్మిట్కు సంబంధించి విజన్ డాక్యుమెంట్ రూపకల్పనలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రులు, అధికారులకు దిశా నిర్దేశం చేశారు. రేపు సాయంత్రానికి ఆయా శాఖలకు సంబంధించి అధికారులు పూర్తి నివేదికను సమర్పించాలి. 3,4 తేదీలల్లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి క్షుణ్ణంగా పరిశీలించి 6 తేదీకి విజన్ డాక్యుమెంట్ రూపొందించాలన్నారు.
News December 1, 2025
హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్.!

ఎయిడ్స్ వచ్చిన సరే సాధారణ జీవితం గడపవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గత 5ఏళ్లలో హైదరాబాద్ జిల్లా వ్యాప్తంగా 9,744 మందికిపైగా ఎయిడ్స్ వ్యాధి బారిన పడినవారు ఉన్నారు. రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సమాజం ఈ లెక్కలు చెబుతోంది. వీటితోపాటు నివారణ అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యాంటీరెట్రోవైరల్ థెరపీ ద్వారా ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. కాగా, నేడు ప్రపంచ ఎయిడ్స్ నివారణ దినోత్సవం.


