News March 19, 2024

REWIND: అనంతపురం MPగా హైదరాబాద్ రాజు

image

హైదరాబాద్ రాజు మన అనంతపురం ఎంపీగా పని చేశారని మీకు తెలుసా? ఇది నిజమే. హైదరాబాద్ సంస్థానం 1948లో భారత దేశంలో విలీనమైంది. ఆ తర్వాత నిజాం చివరి పాలకుడైన మీర్ ఉస్మాన్ అలీ ఖాన్(6వ నిజాం) 1957లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కర్నూలు నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేసి విజయం సాధించారు. అలాగే 1962లో అనంతపురం ఎంపీగా ఎన్నికయ్యారు. రానున్న ఎన్నికల్లో అనంతపురం ఎంపీగా ఏ పార్టీ అభ్యర్థి గెలుస్తారో కామెంట్.

Similar News

News October 31, 2024

సమష్టిగా పనిచేసి నేర నియంత్రణకు అడ్డుకట్ట వేయాలి: ఎస్పీ

image

సమష్టిగా పనిచేసే నేరాల నియంత్రణకు అడ్డుకట్ట వేయాలని శ్రీ సత్యసాయి జిల్లా ఎస్పీ రత్న పేర్కొన్నారు. బుధవారం ఆమె జిల్లా పోలీస్ కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలతో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసులను విచారించి త్వరగా పూర్తి చేయాలన్నారు. శాంతిభద్రతల పరిరక్షణకు గట్టి చర్యలు తీసుకోవాలని సూచించారు. హత్య, పోక్సో, గ్రేవ్, నాన్ గ్రేవ్ కేసులపై ఎస్పీ ఆరా తీశారు.

News October 30, 2024

RESULTS: ఫార్మా డీ ఫలితాలు విడుదల

image

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం పరిధిలోని ఫార్మా డీ 2, 3, 4 సంవత్సరాల రెగ్యులర్, సప్లిమెంటరీ (R14, R17) పరీక్షల ఫలితాలను విడుదల చేసినట్లు డైరెక్టర్ ఆఫ్ ఎవాల్యూయేషన్ నాగప్రసాద్ నాయుడు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ శివ కుమార్ తెలిపారు. విద్యార్థులు తమ ఫలితాల కోసం https://jntuaresults.ac.in/ వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.

News October 30, 2024

టీటీడీ బోర్డు సభ్యుడిగా ఎమ్యెల్యే MS రాజు నియామకం

image

తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యుడిగా మడకశిర నియోజకవర్గం ఎమ్యెల్యే MS రాజు నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం, ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి ఈయన ఒక్కరికే బోర్డు సభ్యుడిగా అవకాశం రావడం విశేషం.