News December 28, 2025

REWIND: ఆదిలాబాద్‌లో అక్రమాలకు ఎస్పీ అడ్డుకట్ట

image

ఆదిలాబాద్ జిల్లా ఎస్పీగా మార్చి 10న అఖిల్ మహాజన్ బాధ్యతలు చేపట్టారు. అప్పటినుంచి తన మార్కును చాటుతూ జిల్లాలో శాంతిభద్రత పరిరక్షణకు కృషి చేస్తున్నారు. జిల్లాలో ఈ ఎడాది రౌడీయిజం, భూ కబ్జాదారులు, వడ్డీ వ్యాపారులు, ఆకతాయిల ఆట కట్టిస్తున్నారు. మై ఆటో ఇస్ సేఫ్, ఆపరేషన్ చబుత్ర, పోలీస్ అక్క, రోడ్ సేఫ్టీ, సైబర్ నేరాల నియంత్రణ తదితర కార్యక్రమాలు చేపట్టారు. గంజాయి నిర్మూలనకు విస్తృత దాడులు నిర్వహించారు.

Similar News

News February 19, 2026

ఎవరెస్ట్.. కడప జిల్లా నుంచి ఈ విద్యార్థి మాత్రమే.!

image

ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించేందుకు లద్దాక్‌‌లో నిర్వహించనున్న 12 రోజుల ప్రత్యేక శిక్షణా కార్యక్రమానికి బద్వేలు govt భవిత ట్రైనింగ్ సెంటర్‌ విద్యార్థి వెంకీ ఎంపికైనట్లు MPDO మల్లేశ్వరి తెలిపారు. జిల్లా నుంచి ఏకైక విద్యార్థిగా వెంకీ ఎంపిక కావడం గర్వకారణమని పేర్కొన్నారు. ఎవరెస్టు అధిరోహణపై ఆసక్తి గల ప్రభుత్వ పాఠశాల విద్యార్థులను రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక శిక్షణ ద్వారా ఎంపిక చేస్తోందని ఆమె తెలిపారు.

News February 19, 2026

రైతులకు సకాలంలో సేవలు అందాలి: కలెక్టర్‌

image

జిల్లాలో వ్యవసాయ రంగ అభివృద్ధి, ప్రభుత్వ పథకాల అమలుపై కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. గురువారం కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. రైతులకు సకాలంలో సేవలందించడంలో అధికారులు నిర్లక్ష్యం వహించకూడదన్నారు. ముఖ్యంగా వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద జిల్లాకు కేటాయించిన నిధులను ఈ నెలాఖరులోగా అర్హులైన రైతులకు అందజేయాలని ఆదేశించారు.

News February 19, 2026

పార్వతీపురం: ‘పారిశ్రామికాభివృద్ధికి పెద్దపీట’

image

జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి వేగవంతం చేసేందుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేలా చర్యలు చేపట్టాలని కలెక్టర్ డా.ఎన్.ప్రభాకర రెడ్డి పేర్కొన్నారు. గురువారం పార్వతీపురం కలెక్టరేట్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో పెండింగులో ఉన్న దరఖాస్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అన్నారు. బ్యాంకులు రుణాల మంజూరులో జాప్యం ఉండరాదన్నారు.