News March 7, 2025

REWIND: ఎలిమినేటిని హిట్ లిస్ట్‌లో పెట్టి చంపేశారు!

image

<<15677348>>ఎలిమినేటి <<>>1985లో తొలిసారి భువనగిరి MLAగా ఎన్నికై ఆ తర్వాత చంద్రబాబు కేబినెట్‌లో హోం మినిస్టర్‌ అయ్యారు. TDPప్రభుత్వం నక్సల్స్‌పై నిషేధాస్త్రం ప్రయోగిచడంతో స్టేట్‌లో అనేక ఎన్‌కౌంటర్లు జరిగాయి. గద్దర్‌పై కాల్పులు..బెల్లి లలిత హత్య, పీపుల్స్‌వార్‌ అగ్రనేతలు ఎర్రంరెడ్డి సంతోష్‌రెడ్డి,నల్లా ఆదిరెడ్డి, శీలం నరేశ్‌ ఎన్‌కౌంటర్లు జరగడంతో మాధవరెడ్డిని పీపుల్స్‌వార్‌ గ్రూపు తన హిట్‌లిస్ట్‌లో చేర్చి చంపింది.

Similar News

News April 13, 2026

సెకండియర్ ఫలితాల్లో పెద్దపల్లి అమ్మాయిలు అదుర్స్..!

image

ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సర ఫలితాల్లో పెద్దపల్లి జిల్లా బాలికలు అదరగొట్టారు. బాలికలు 77.45% ఉత్తీర్ణత సాధించగా, బాలురు 55.01% తో వెనుకబడ్డారు. సుమారు 22.44 శాతం ఆధిక్యంతో అమ్మాయిలు తమ ఆధిపత్యాన్ని చాటుకున్నారు. మొత్తం 2,226 మంది బాలికలకు గాను 1,724 మంది ఉత్తీర్ణులయ్యారు. బాలుర కంటే బాలికలే మెరుగైన ఫలితాలు సాధించడంపై విద్యాశాఖ హర్షం వ్యక్తం చేసింది.

News April 13, 2026

పల్నాడు: 15న ధరణికోటకు సీఎం చంద్రబాబు

image

రాష్ట్ర వ్యాప్తంగా మూడో విడత అన్న క్యాంటీన్ల ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 15న పల్నాడు(D) అమరావతి(M) ధరణికోటలో నూతనంగా ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్‌ను CM చంద్రబాబు ప్రారంభించనున్నారు. CM పర్యటన దృష్ట్యా జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. హెలిప్యాడ్ నిర్మాణం, విద్యుత్ సరఫరా, తాగునీరు వంటి మౌలిక వసతుల కల్పనలో ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

News April 13, 2026

నిప్పుల కొలిమి నిజామాబాద్.. 40 దాటిన టెంపరేచర్

image

జిల్లాలో భానుడు భగభగలాడుతున్నాడు. తాజాగా నమోదైన గణాంకాల ప్రకారం జిల్లావ్యాప్తంగా ఎండ తీవ్రత ‘అలర్ట్’ స్థాయికి చేరింది. ముఖ్యంగా మోస్రా, సాలూరలో అత్యధికంగా 41.6, నిజామాబాద్ సౌత్ 41.5°C, ​పెర్కిట్ (ఆర్మూర్):41.5°C, ​యెడపల్లి: 41.5°C మంచిప్ప, తుంపల్లిలోనూ 41.5 డిగ్రీల వేడి నమోదైంది. ఉదయం నుంచే సెగలు పుడుతుండటంతో జనం బయటకు రావాలంటేనే భయపడుతున్నారు. అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.