News January 18, 2025
Rewind: చౌటిపల్లెలో బస చేసిన సీనియర్ ఎన్టీఆర్

నందమూరి తారక రామారావు కొండాపురం మండలంలోని చౌటిపల్లెలో గతంలో బస చేశారు. 1982 ఏడాది చివరిలో తాడిపత్రి నుంచి చైతన్య రథంలో డ్రైవర్‌గా హరికృష్ణతో రామారావు రోడ్డు షో నిర్వహించారు. రోడ్డు షోలో భాగంగా చౌటిపల్లె వద్ద గల చిత్రావతి నదిపై వాహనం మొరాయించడంతో అక్కడే అగి బస చేశారు. 1993 ఎన్నికల ప్రచారంలో కూడా పాత కొండాపురంలో టీ తాగారు. నేడు NTR 29వ వర్ధంతి సందర్భంగా ఆయన జ్ఞాపకాలను పలువరురు Rewind చేసుకున్నారు.
Similar News
News September 12, 2025
కడప: RI వీరేశంను సన్మానించిన ఎస్పీ

కడప జిల్లా పోలీసు శాఖకు RI వీరేశ్ ఎంతగానో సేవలు అందించాలని జిల్లా SP అశోక్ కుమార్ ప్రశంసించారు. శుక్రవారం బదిలీపై చిత్తూరుకు వెళ్తున్న ఆర్ఐ వీరేశ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఉన్నతాధికారుల ఆదేశాలను పాటిస్తూ అప్పగించిన విధులను సమర్ధవంతంగా నిర్వర్తించారన్నారు. వీఐపీల రాక సందర్భంలో ఆర్‌ఐ వీరేశ్ అంకితభావంతో విధులు నిర్వర్తించారన్నారు.
News September 12, 2025
భూ సమస్యలపై త్వరిత పరిష్కారం: ఆదితిసింగ్

కడప కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (PGRS) సమావేశంలో జిల్లా ఇన్‌ఛార్జ్ కలెక్టర్, జేసీ ఆదితిసింగ్ అధికారులకు కీలక సూచనలు చేశారు. భూ సంబంధిత ఫిర్యాదులకు బాధ్యతాయుతంగా స్పందించి, వచ్చే నెలలోపు పెండింగ్ ఫిర్యాదులను “సున్నా” స్థాయికి తగ్గించాలని ఆదేశించారు. సెక్షన్ 22-ఏ డెలిషన్, అసైన్డ్ భూముల పరిష్కారంలో క్షేత్రస్థాయి విచారణ తప్పనిసరని పేర్కొన్నారు.
News September 12, 2025
కలసపాడు: 3 ఏళ్ల బాలుడిపై వీధి కుక్కల దాడి

కలసపాడు గ్రామంలోని టైలర్స్ కాలనీలో ఇమ్రాన్ (3)పై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయి. బయట ఆడుకుంటున్న సమయంలో వీధికుక్కలు బాలుడిపై దాడి చేసి లాక్కొని వెళ్తుండగా తల్లిదండ్రులు చూసి కాపాడుకున్నారు. తీవ్ర గాయాలైన చిన్నారిని పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీధి కుక్కలు లేకుండా తరలించాలని అధికారులను ప్రజలు కోరుతున్నారు.