News December 25, 2025

Rewind: జిల్లా రైతులకు ‘ఈ యేడు’ కలిసిరాని ఖరీఫ్

image

PDPL జిల్లా రైతులకు ఖరీఫ్ సాగు కలిసి రాలేదు. ముందస్తుగా మురిపించిన వరుణుడు.. ఆ తరువాత ముఖం చాటేశాడు. దీంతో మొలకదశలో పంటలు ఎండుముఖం పట్టాయి. ఆ తరువాత కురిసిన వర్షాలు ఉపశమనం కలిగించాయి. దీంతో ఎంతో ఆశతో రైతులు వానాకాలంలో 2.60 లక్షల ఎకరాల్లో వివిధ పంటలు సాగు చేశారు. ఈ క్రమంలో మొంథా తుఫాన్ ప్రభావంతో కురిసిన భారీ వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. జిల్లా వ్యాప్తంగా రైతాంగానికి తీవ్ర నష్టాన్ని మిగిల్చింది.

Similar News

News December 28, 2025

వేములవాడ: బద్ది పోచమ్మ సన్నిధిలో ‘బోనాల’ సందడి

image

మేడారం జాతర నేపథ్యంలో వేములవాడకు భక్తుల రాక పెరగడంతో ఆదివారం బద్ది పోచమ్మ ఆలయం వద్ద భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే బోనాలతో క్యూలైన్లలో బారులు తీరారు. ఒక్కో మొక్కు చెల్లించుకోవడానికి సుమారు రెండు గంటల సమయం పడుతోంది. అయితే, క్యూలైన్లలో తగిన వసతులు లేకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని అధికారులు మెరుగైన ఏర్పాట్లు చేయాలని స్థానికులు కోరుతున్నారు.

News December 28, 2025

జియో, NSE, ఓయో.. 2026లో IPOల జాతర

image

2025లో IPOల జోరు తర్వాత 2026లో ఏకంగా రూ.1 లక్ష కోట్ల సందడి మొదలుకానుంది. దలాల్ స్ట్రీట్‌లోకి దిగ్గజ కంపెనీలు లిస్టింగ్‌కు క్యూ కడుతున్నాయి. అందరూ ఎదురుచూస్తున్న జియో, NSE, ఫోన్‌పే IPOలు వచ్చే ఏడాదే వచ్చే ఛాన్స్ ఉంది. వీటితో పాటు ఫ్లిప్‌కార్ట్, జెప్టో, ఓయో, బోట్ వంటి బడా కంపెనీలు కూడా లిస్టింగ్ రేసులో ఉన్నాయి. SBI MF, ఫ్రాక్టల్ అనలిటిక్స్ వంటి సంస్థలు కూడా ఇన్వెస్టర్లను ఊరించనున్నాయి.

News December 28, 2025

2025: ‘అంచనాలు’ అందుకోలేకపోయారు?

image

ఈ ఏడాది పలువురు టాలీవుడ్ హీరోల సినిమాలు అంచనాలను అందుకోలేకపోయాయి. విడుదలకు ముందు బజ్ ఉన్నా రిలీజ్ తర్వాత అభిమానులకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’, ఎన్టీఆర్ ‘వార్-2’, పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’, విష్ణు ‘కన్నప్ప’, విజయ్ దేవరకొండ ‘కింగ్డమ్’, రవితేజ ‘మాస్ జాతర’ లిస్టులో ఉన్నాయి. ఈ ఏడాది రిలీజైన వాటిలో మిమ్మల్ని నిరాశపర్చిన సినిమా ఏంటి?