News November 5, 2024

REWIND: టెక్కలిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు

image

టెక్కలి కచేరివీధిలో బాంబు పేలుడు ఘటనకు మూడేళ్లు అయ్యింది. 2021 నవంబర్ మాసంలో దీపావళి సందర్భంగా టెక్కలికి చెందిన ఎస్.సాయిగోపాల్, వీ.హరి, ఎస్.మూర్తి అనే ముగ్గురు స్నేహితులు ఒక ఇంటి ఆవరణలో దీపావళి చేతిబాంబులు తయారు చేస్తున్న క్రమంలో అప్పట్లో పేలుడు జరిగింది. ఈ ఘటనతో నాడు టెక్కలి ప్రజానీకం ఉలిక్కిపడ్డారు. తీవ్రంగా గాయపడిన యువకులు సుదీర్ఘకాలం చికిత్స అనంతరం కోలుకుని ప్రాణాలతో బయట పడ్డారు.

Similar News

News February 24, 2026

శ్రీకాకుళం: జిల్లా స్థాయి సైక్లింగ్ పోటీల నిర్వహణ

image

శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో మంగళవారం జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో సైక్లింగ్ పోటీలు నిర్వహించారు. అండర్-18 పురుషులు, మహిళల విభాగంలో ఈ పోటీలు జరిగాయి. జిల్లా క్రీడాభివృద్ధి అధికారి మహేశ్ బాబు పోటీలను పర్యవేక్షించారు. విజేతలు ఈనెల 28న ఎన్టీఆర్ జిల్లాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.

News February 24, 2026

శ్రీకాకుళం: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరు

image

శ్రీకాకుళం జిల్లాలోని 71 పరీక్షా కేంద్రాల్లో మంగళవారం జరిగిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షకు 312 మంది గైర్హాజరైనట్లు జిల్లా ఆర్ఐఓ ఆర్.సురేష్ కుమార్ తెలిపారు. మొత్తం 19,158 మంది పరీక్షకు హాజరుకావాల్సి ఉండగా 18,840 మంది విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు పేర్కొన్నారు. 98.34 హాజరు శాతం నమోదు అయినట్లు ఆయన వెల్లడించారు.

News February 24, 2026

శ్రీకాకుళం నాయకులతో లోకేశ్ ఆత్మీయ సమావేశం

image

మంగళగిరిలో ఐటి విద్యాశాఖ మంత్రి శ్రీకాకుళం నాయకులతో సోమవారం ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. వారి కుటుంబాలతో మంత్రి లోకేశ్ ఆత్మీయంగా మాట్లాడారు. వారికి కానుకలు అందజేశారు. యోగక్షేమాలు అడుగుతూ సరదాగా గడిపారు.