News December 29, 2025

REWIND: తెనాలిలో ఈ ఏడాది జరిగిన సంచలన ఘటన ఇదే..!

image

తెనాలిలో ఈ ఏడాది జరిగిన ఓ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైంది. కానిస్టేబుల్‌పై దాడి కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు నడిరోడ్డుపై కూర్చోబెట్టి అరికాళ్లపై కొట్టడం తీవ్ర కలకలం రేకెత్తించింది. ఇది జరిగిన నెల రోజుల తర్వాత మే 20న వీడియో వెలుగులోకి వచ్చింది. నిందితులను పరామర్శించేందుకు జూన్ 3న వైఎస్ జగన్ తెనాలి రావడం కూడా విమర్శలకు కారణమైంది. పోలీసుల చర్యలను కొందరు సమర్ధించగా మరికొందరు వ్యతిరేకించారు.

Similar News

News January 7, 2026

GNT: ధరల పతనానికి బ్రేక్‌.. మిర్చి మార్కెట్‌లో ప్రభుత్వం ఫుల్‌ కంట్రోల్

image

గతేడాది మిర్చి రైతులు ఎదుర్కొన్న ఇబ్బందులు పునరావృతం కాకుండా ముందస్తు చర్యలు చేపట్టామని మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. గుంటూరులో జరిగిన సమీక్షలో మిర్చి ధరలు ఈ ఏడాది ఆశాజనకంగా ఉన్నాయన్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతో ఉత్పాదకత 44 శాతం తగ్గిందని, రైతులకు నష్టమేమీ కలగకుండా ఇ-క్రాప్ 100 శాతం అమలు, రసీదులు తప్పనిసరి చేయాలని అధికారులను ఆదేశించారు.

News January 7, 2026

GNT: గుడ్ న్యూస్.. వారికి కేవలం రూ.1కే నెలంతా ఫ్రీ

image

BSNLఎస్.ఆర్.సి-1 ప్లాన్ పునఃప్రారంభించినట్లు BSNLకొత్తపేట శాఖ డీజీఎం బి.శ్యామ్ ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సిమ్ కార్డు ఉచితంగా ఇవ్వడంతో పాటూ ఒక్క రూపాయితో 30 రోజుల కాలపరిమితితో అపరిమిత కాలింగ్స్, 100 సందేశాలు, 2GB డేటా ఇస్తున్నామని తెలిపారు. ఈ నెల 31వరకు ఆఫర్ అందుబాటులో ఉంటుందని, వినియోగదారులు ఈ అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.

News January 7, 2026

GNT: డిజిటల్ టిక్కెట్‌కు ప్రోత్సాహం.. జనరల్ టిక్కెట్లపై రాయితీ

image

రైల్ వన్ యాప్ వినియోగాన్ని పెంచేందుకు దక్షిణ మధ్య రైల్వే కొత్త ప్రోత్సాహకం ప్రకటించింది. యాప్ ద్వారా కొనుగోలు చేసే జనరల్ టిక్కెట్లపై 3 శాతం తగ్గింపు ఇస్తామని సీపీఆర్వో ఏ.శ్రీధర్ గుంటూరులో మంగళవారం వెల్లడించారు. ఆన్‌లైన్ చెల్లింపులు చేసినప్పుడు మాత్రమే ఈ రాయితీ వర్తిస్తుందని తెలిపారు. జనవరి 14 నుంచి జులై 14 వరకు ఈ సౌకర్యం అమల్లో ఉంటుంది. టిక్కెట్ కౌంటర్ల వద్ద రద్దీ తగ్గించడమే లక్ష్యమన్నారు.