News March 30, 2024
REWIND: నాడు 355 ఓట్ల మెజార్టీతో గన్నవరం ఎమ్మెల్యే

గన్నవరం నియోజకవర్గానికి ఇప్పటివరకు 15 సార్లు ఎన్నికలు జరగ్గా.. 355 ఓట్ల మెజార్టీ అత్యల్పం. 1972లో కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన టి.ఎస్.ఆనందబాయి ఇంత తక్కువ మెజార్టీతో ఎమ్మెల్యే అయ్యారు. ఇదే నియోజకవర్గంలో 1989లో 715 ఓట్లు, 1955లో 823 ఓట్లు, 2019లో 838 ఓట్ల మెజార్టీతో ముసునూరు రత్నబోస్, పి. సుందరయ్య, వల్లభనేని వంశీ ఎమ్మెల్యేలుగా గెలిచారు. ఈసారి గన్నవరంలో వంశీ, యార్లగడ్డ వెంకట్రావు తలపడుతున్నారు.
Similar News
News April 18, 2025
బాపులపాడు: మార్కెట్‌కి వెళ్తుండగా ప్రమాదం.. ఒకరి మృతి

బాపులపాడు మండలం వేలేరు వద్ద శుక్రవారం రోడ్డు ప్రమాదం జరిగింది. వేలేరు వద్ద కారు ఢీ కొనడంతో బైక్‌పై వెళ్తున్న బాబు అనే వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. ఇతను తేలప్రోలులో పట్టుగూళ్ల రీలింగ్ యూనిట్‌ని నిర్వహిస్తుంటాడు. పట్టుగూళ్ల కోసం హనుమాన్ జంక్షన్ మార్కెట్‌కు వస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది.
News April 18, 2025
ఘంటసాల: అప్పుడు తండ్రి.. ఇప్పుడు కొడుకు..!

ఘంటసాల పరిధిలోని పాప వినాశనం వద్ద విషాదం చోటుచేసుకుంది. గురువారం KEB కాలువలో పదో తరగతి విద్యార్థి పవన్ గల్లంతయ్యాడు. దురదృష్టవశాత్తూ ఇదే స్థలంలో 11 ఏళ్ల క్రితం పవన్ తండ్రి కూడా మృతి చెందారు. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న కుమారుడు కాలువలో కొట్టుకుపోవడంతో తల్లి గుండెలు అవిసేలా రోధిస్తోంది. గ్రామస్థులు పవన్ ఆచూకీ కోసం గాలిస్తున్నారు.
News April 18, 2025
హనుమాన్ జంక్షన్‌లో తనిఖీలు చేసిన ఎస్పీ

రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు గురువారం రాత్రి జిల్లావ్యాప్తంగా పోలీసులు నాకాబందీ నిర్వహించారు. హనుమాన్ జంక్షన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పెరికేడు అండర్ పాస్ వద్ద జరిగిన నాకాబందిలో పాల్గొన్న జిల్లా ఎస్పీ గంగాధరరావు స్వయంగా వాహన తనిఖీలు చేశారు. వాహన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి వారు ఎక్కడ నుంచి వస్తున్నది అడిగి తెలుసుకున్నారు.