News March 27, 2024
REWIND.. నెల్లూరులో ‘ఉదయించిన సూర్యుడు’

నెల్లూరు నియోజకవర్గంలో 1989 ఎన్నికల్లో జక్కా కోదండరామి రెడ్డి(జేకే రెడ్డి) సంచలనం సృష్టించారు. అప్పట్లో ఆయన స్వతంత్ర అభ్యర్థిగా రంగంలోకి దిగగా ఎన్నికల కమిషన్ ఉదయించే సూర్యుడు గుర్తు కేటాయించింది. ఆ ఎన్నికల్లో ప్రచారాన్ని జేకే రెడ్డి సరికొత్త పుంతలు తొక్కించారు. అందరి మనస్సు చూరగొని తన సమీప ప్రత్యర్థి, టీడీపీ అభ్యర్థి తాళ్లపాక రమేష్ రెడ్డిపై 14474 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.
Similar News
News November 4, 2025
నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకు మాజీ మంత్రి జోగి

నకిలీ మద్యం కేసులో మాజీ మంత్రి జోగి రమేష్‌తో పాటు అతని సోదరుడు జోగి రాములను నెల్లూరు జిల్లా సెంట్రల్ జైలుకి తరలించారు. విజయవాడ జైల్లో ఉన్న వారిద్దరిని నెల్లూరు సెంట్రల్ జైలుకు తీసుకురాగా.. జైలు వద్ద మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, ఎమ్మెల్సీ పర్వత రెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆయన్ని కలిశారు. ఈ సందర్భంగా జోగి రమేష్‌ని కాకాని గోవర్ధన్ రెడ్డి ఆలింగనం చేసుకున్నారు.
News November 3, 2025
నెల్లూరు: మా మొర ఆలకించండి సారూ..!

క్షేత్రస్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతోనే ప్రజలు ఉన్నతాధికారులకు మొరపెట్టుకుంటున్నారు. అర్జీలు ఇస్తున్నారు తప్పితే అవి పరిష్కారం కావడానికి మరలా కిందిస్థాయికి వెళ్లాల్సి వస్తుంది. రామాయపట్నం పోర్టుకు భూములిచ్చిన ఓ రైతుకు ఇవ్వాల్సిన పరిహారం తన ఖాతాలో కాకుండా మరొక రైతు ఖాతాలో జమయిందని కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించారు. కానీ ఆ సమస్య అలానే ఉండిపోవడం పరిస్థితికి అద్దం పడుతోంది.
News November 3, 2025
ఉద్యోగం ఇప్పిస్తానని రూ.45 లక్షల మోసం

డెన్మార్క్‌లో ఉద్యోగం ఇప్పిస్తానని కొల్లూరు సుధాకర్ అనే వ్యక్తి రూ.45 లక్షలు తీసుకొని మోసం చేశారంటూ దర్గామిట్టకు చెందిన ఓ బాధితుడు నెల్లూరు జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. డబ్బులు తిరిగి ఇవ్వకుండా ఉద్యోగం ఇప్పించకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నాడని అవేదన వ్యక్తం చేశారు. విచారించి న్యాయం చేయాలని కోరారు. నెల్లూరు జిల్లా ఎస్పీ వెంటనే స్పందించి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు.


