News March 31, 2024
REWIND: నెల్లూరు జిల్లాలో ఇద్దరు CMలు

బుచ్చిరెడ్డిపాలేనికి చెందిన బెజవాడ గోపాల రెడ్డి మద్రాసు రాష్ట్రంలోనే మంత్రిగా పని చేశారు. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడటంతో 1955లో ఆయన CMగా బాధ్యతలు స్వీకరించారు. తర్వాత హైదరాబాద్ రాజధానిగా విశాలాంధ్ర ఏర్పడగా ఉపముఖ్యమంత్రిగా పనిచేశారు. అలాగే వాకాడుకు చెందిన నేదురుమల్లి జనార్దన్ రెడ్డి 1990 డిసెంబర్ 17న CMగా బాధ్యతలు స్వీకరించారు. సంవత్సరం 297 రోజులు ఆయన ఆ పదవిలో ఉన్నారు.
#ELECTIONS2024
Similar News
News September 30, 2025
నెల్లూరు: కట్టారు.. వదిలేశారు..!

జిల్లా ఔషద నియంత్రణ శాఖ AD కార్యాలయాన్ని రూ. కోట్లు వెచ్చించి నెల్లూరు పెద్దాసుపత్రి ఆవరణంలో దాదాపు 6 నెలల క్రితం నిర్మించారు. అయితే అధికారులు ఆ భవనాన్ని ప్రారంభించకపోవడంతో చుట్టూ పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి. ఎన్నో ఏళ్ల నుంచి జేమ్స్ గార్డెన్‌లో అద్దె భవనంలో ఉంటున్న కార్యాలయాన్ని సొంత భవనంలోకి తరలిస్తే పరిపాలపరంగా సులువుగా ఉంటుంది. అధికారులు స్పందించి కార్యాలయం వినియోగంలోకి తీసుకురావాల్సి ఉంది.
News September 30, 2025
నెల్లూరు జిల్లాలో -20.7 లోటు వర్షపాతం

నెల్లూరు జిల్లాలో గత 4 నెలల్లో 320.4 MM సాధారణ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 254.2 MM వర్షపాతం నమోదై -20.7 MM లోటు వర్షపాతం నెలకొంది. జిల్లాలోని 22 మండలాల్లో లోటు వర్షపాతం, 13 మండలాల్లో సాధారణం, కోవూరు, విడవలూరు, వెంకటాచలం మండలాల్లో మాత్రమే ఎక్కువ వర్షపాతం నమోదైంది. కాగా జిల్లా వ్యాప్తంగా ఈఏడాదిలో ఇప్పటివరకు 1052.9 MM వర్షపాతం కురవాల్సి ఉండగా.. 1170.3 MM నమోదై వర్షభావం నుంచి బయట పడినట్టయింది.
News September 30, 2025
అకాడమీలు లేక క్రీడలు వెలవెల

క్రీడల్లో రాణించాలంటే శిక్షణ అవసరం. అందుకు అకాడమీలు ఉండాలి. అయితే జిల్లాకు ప్రధాన స్పోర్ట్స్ కాంప్లెక్స్ అకాడమీలు లేక వెలవెలబోతోంది. బ్యాడ్మింటన్, ఫుట్ బాల్, అథ్లెటిక్స్, ఖోఖో, హ్యాండ్ బాల్, వాలీబాల్ క్రీడలకు అకాడమీలు ఉండేవి. ఇవి కాస్త ప్రస్తుతం మూత పడ్డాయి. వీటిని అందుబాటులోకి తీసుకొస్తే క్రీడాకారులకు ప్రయోజనంగా ఉంటాయి. ఈ ప్రభుత్వంలోనైనా వాటిని మంజూరు చేస్తారేమో చూడాలి.