News March 28, 2024

REWIND: నెల్లూరు జిల్లాలో ఓడిపోయిన సినీనటి

image

ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో చేనేతలు ఎక్కువగా ఉంటారు. ఈ నేపథ్యంలో 1999 ఎన్నికల్లో అదే సామాజికవర్గానికి చెందిన సినీనటి శారదను TDP రంగంలోకి దింపింది. కాంగ్రెస్ అభ్యర్థిగా మాజీ CM నేదురమల్లి జనార్దన్ రెడ్డి సతీమణి రాజ్యలక్ష్మి తొలిసారి పోటీ చేశారు. 10,718 ఓట్ల మెజార్టీతో ఆమె గెలిచారు. తాజా ఎన్నికల్లో YCP నుంచి ఆమె తనయుడు రాంకుమార్ రెడ్డి, TDP అభ్యర్థిగా సాయిలక్ష్మి ప్రియ బరిలో ఉన్నారు.

Similar News

News September 18, 2025

వాహన మిత్ర’’ కు దరఖాస్తు చేసుకోండి: కలెక్టర్

image

ఆటో, మాక్సీ క్యాబ్‌ వాహన యజమానులు ‘‘వాహన మిత్ర’’ పథకం కోసం సమీపంలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకోవాలని కలెక్టర్‌ హిమాన్షు శుక్ల ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోగా దరఖాస్తులను అందించాలని సూచించారు. రిజిస్ట్రేషన్‌ కార్డ్‌, పర్మిట్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఫిట్‌ నెస్‌ మొదలైన సర్టిఫికెట్లతో దరఖాస్తులు అందించాలన్నారు.

News September 18, 2025

నెల్లూరు: చేపల పెంపకానికి కోళ్ల వ్యర్థాలు..!

image

నెల్లూరు జిల్లాలో కొందరు నిషేధిత క్యాట్ ఫిష్ పెంచుతున్నారు. వీటికి కోళ్ల వ్యర్థాలను మేతగా వాడుతూ ప్రజారోగ్యం, పర్యావరణానికి ముప్పు తెస్తున్నారు. జిల్లాలోని 16 మండలాల పరిధిలో 21,629 చెరువుల్లో అనుమతులతో చేపలు పెంచుతున్నారు. మరో 5వేల ఎకరాల్లో అక్రమంగా ఆక్వా సాగు ఉన్నట్లు అంచనా. అల్లూరు, బుచ్చి, సంగం, కోవూరు, ముత్తుకూరు, నెల్లూరు రూరల్ పరిధిలో వ్యర్థాల వాడకం ఎక్కువగా ఉంటోంది.

News September 18, 2025

నెల్లూరు: రేషన్ బియ్యం అక్రమ రవాణా ఆగేదెప్పుడు?

image

నెల్లూరులో రేషన్ బియ్యం మాఫియా ఆగడం లేదు. ప్రభుత్వ హెచ్చరికలు, కేసులు ఉన్నా అక్రమార్కులు కోట్ల విలువైన బియ్యం నల్లబజారుకు మళ్లిస్తున్నారు. నెల్లూరు, ఆత్మకూరు ప్రాంతాలకు చెందిన వ్యాపారులు మిల్లుల్లోనే బియ్యం రీసైకిల్ చేసి సీఎంఆర్ కింద ప్రభుత్వానికే తిరిగి పంపుతున్నారు. జిల్లాలో నెలకు సరఫరా చేసే 11 వేల టన్నుల్లో సుమారు 8 వేల టన్నులు పక్కదారి పడుతున్నాయని సమాచారం.