News March 8, 2025
Rewind: పల్నాడులో 23 మందిని చంపిన నిందితులకు క్షమాభిక్ష

32 ఏళ్ల క్రితం నరసరావుపేటలో 23 మందిని కాల్చి చంపేసిన ఘటనలో నిందితులు చలపతి, విజయవర్ధన్‌ను 1993 మార్చి 18న పోలీసులు అరెస్ట్ చేశారు. 96 ఆగస్టు 28న సుప్రీంకోర్టు వారికి మరణశిక్ష విధించింది. 1997 మార్చి 29న వారి ఉరిశిక్షకు ఏర్పాట్లు చేశారు. వారు రాష్ట్రపతి శంకర్ దయాల్ శర్మకు క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్నారు. అది పెండింగ్లో ఉండటంతో ఉరిశిక్ష వాయిదా వేయాలని సుప్రీమ్ ఆదేశించింది.
Similar News
News November 11, 2025
నిజామాబాద్: ఆరుగురికి జైలు శిక్ష

డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడిన ఆరుగురికి జైలు శిక్ష విధిస్తూ నిజామాబాద్ స్పెషల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ నూర్జహాన్ మంగళవారం తీర్పు చెప్పారని NZB ట్రాఫిక్ CI ప్రసాద్ తెలిపారు. ఇద్దరికి 4 రోజులు, మరో ఇద్దరికి 3 రోజులు, మరో ఇద్దరికి 7 రోజుల చొప్పున జైలు శిక్ష విధించినట్లు చెప్పారు. అలాగే 28 మందికి రూ.2.69 లక్షల జరిమానా విధించినట్లు వివరించారు.
News November 11, 2025
తెలంగాణ న్యూస్

⋆ ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్స్ కేసులో CID విచారణకు హాజరైన విజయ్ దేవరకొండ.. గంటపాటు విచారించి స్టేట్‌మెంట్ రికార్డు చేసిన అధికారులు
⋆ HYD: ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారని కాంగ్రెస్ MLAలు బీర్ల ఐలయ్య, రామచంద్రు నాయక్, రామదాసుపై మధురా నగర్ పీఎస్‌లో కేసు నమోదు.. BRS నేతలు వినయ్ భాస్కర్, ఆనంద్‌పై బోరబండ పీఎస్‌లో కేసు నమోదు
⋆ మరో గంటలో ముగియనున్న జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్
News November 11, 2025
అధిక పాలిచ్చే పశువును ఎలా గుర్తించాలి?(1/2

పాడి ద్వారా ఎక్కువ ఆదాయం రావాలంటే మనం కొనే పశువు ప్రతి 14 నుంచి 15 నెలలకు ఒకసారి ఈనేట్లు ఉండాలి. పాడి పశువు పాలసార గురించి తెలుసుకోవాలంటే ఆ పశువు పొదుగును గమనించాలంటున్నారు వెటర్నరీ నిపుణులు. పొదుగు పెద్దదిగా ఉండి, శరీరంలో కలిసినట్లుగా ఉండాలి. అలాకాకుండా పొదుగు వేళ్లాడుతూ, జారిపోతున్నట్లుగా ఉండకూడదు. నాలుగు పాలసిరల (చనుమొనలు) అమరిక చతురస్రాకారంగా ఉండి, అన్నింటి నుంచి పాలు సులువుగా వస్తుండాలి.


